Oxygen Plant: గుజరాత్‌లో కొత్తగా 11 ఆక్సిజన్ ప్లాంట్‌లు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
Oxygen Plant: కోవిడ్ మహమ్మారి కారణంగా దేశమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో ఆక్సిజన్ కొరత కూడా మరింత ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆక్సిన్ కొరత లేకుండా...

Oxygen Plant: కోవిడ్ మహమ్మారి కారణంగా దేశమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో ఆక్సిజన్ కొరత కూడా మరింత ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆక్సిన్ కొరత లేకుండా తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది. ఇక గుజరాత్‌లో 11 కొత్త ప్రెషర్ స్వింగ్ అడ్సార్‌ప్షన్ (పీఎస్‌ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఆక్సిజన్ సరఫరాకు దేశ వ్యాప్త ప్రచారం ప్రారంభించనున్నామని, ఇందులో భాగంగా 11 కొత్త పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లను గుజరాత్‌లో ఏర్పాటు చేస్తామని అన్నారు. గుజరాత్‌లో ఉత్పత్తి అదనపు ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేస్తామన్నారు. దీనికి ముందు, గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లాలోని కొల్వాడ గ్రామంలో గల ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో నూతన ఆక్సిజన్ ప్లాంట్‌ను అమిత్ షా ప్రారంభించారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై అమిత్ షా శుక్రవారం సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ సరఫరా పెంచేందుకు తీసుకోవాల్సిన వివిధ చర్యలపై అధికారులకు ఆయన దిశ నిర్దేశం చేశారు. కోవిడ్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అహ్మదాబాద్ సిటీలో ధన్వంతర కోవిడ్ ఆస్పత్రి సన్నద్ధతను కూడా ఆయన సమీక్షించారు.ఈ ఆస్పత్రిలో 950 సాధారణ పడకలు, 250 ఐసీయూ పడకలు ఉన్నాయి.
ఇవీ చదవండి: Medical Oxygen: భారత్‌కు ప్రాణవాయువు అందిస్తున్న సింగపూర్.. యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా..!