ఆక్సిజన్ కొరత, సంక్షోభ నివారణకు యూపీలో వినూత్న ప్రయోగం, సరికొత్త డిజిటల్ వ్యవస్థ

ఆక్సిజన్ కొరత, సంక్షోభ నివారణకు యూపీ ప్రభుత్వం వినోత్న ప్రయోగం చేబట్టింది.దీన్ని మానిటర్ చేసేందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యవస్థను క్రియేట్ చేసింది.

ఆక్సిజన్ కొరత, సంక్షోభ నివారణకు యూపీలో వినూత్న ప్రయోగం, సరికొత్త డిజిటల్ వ్యవస్థ
Up Govt. Launches Oxygen Monitoring System
Umakanth Rao

| Edited By: Phani CH

Apr 24, 2021 | 10:30 PM

ఆక్సిజన్ కొరత, సంక్షోభ నివారణకు యూపీ ప్రభుత్వం వినోత్న ప్రయోగం చేబట్టింది.దీన్ని మానిటర్ చేసేందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యవస్థను క్రియేట్ చేసింది. ‘ఆక్షిజన్ మానిటరింగ్ సిస్టం ఫర్ యూపీ’ పేరిట ఈ వ్యవస్థ.. ఆక్సిజన్ ని డెలివరీ చేసే వెహికల్స్ లొకేషన్ ని ట్రాక్ చేయగలుగుతుంది. అలాగే రియల్ టైం మానిటరింగ్, ట్రాకింగ్ ని కూడా పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవస్థను లాంచ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ డిమాండును తీర్చేందుకు, ఆయా హాస్పటల్స్ డిమాండుకు సంబంధించి ఇది  లైవ్ సమాచారాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. హైవేలపై వాహనాల లొకేషన్, ఆక్సిజన్ సప్లయ్, దాని వినియోగం తదితరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు.కాగా రోడిక్  కన్సల్టెంట్స్ అనే సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ తదితర సంస్థల సహకారంతో ఈ డిజిటల్ వ్యవస్థను క్రియేట్ చేసిందని యూపీ అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.

ఆక్సిజన్ లభ్యతకు ఇది దోహదపడడమే గాక వెహికల్స్ దారి మళ్లకుండా చూస్తుందని, ఇతర రాష్ట్రాలకు లేదా వేరే ప్రదేశాలకు ఆ వాహనాలు వెళ్లకుండా మనం చూడవచ్చునని వారు చెప్పారు. యూపీ సైతం కోవిడ్ కేసులతో తీవ్రంగా సతమతమవుతోంది  ఈ రాష్ట్రంలో ఒక్కరోజే 37,238 కేసులు నమోదు కాగా.. 196 మంది రోగులు మరణించారు. మొత్తం ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య సుమారు 10 లక్షలకు చేరింది. ఇప్పటివరకు దాదాపు  11 వేలమంది మృత్యుబాట పట్టారు.   ఈ కారణం వల్లే దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా చేరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఎంపీ ల్యాడ్ ఫండ్ కింద కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రూ. 1.17 కోట్ల విరాళం, ఎందుకంటే ?

Indonesia Sub Marine: ఆ జలాంతర్గామి కథ ముగిసినట్టే..అందులోని 53 మంది బ్రతికి ఉండటం కష్టమే..ఇండోనేషియా నేవీ చీఫ్ మార్గోనో!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu