Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంపీ ల్యాడ్ ఫండ్ కింద కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రూ. 1.17 కోట్ల విరాళం, ఎందుకంటే ?

యూపీలోని తన లోక్ సభ నియోజకవర్గం రాయ్ బరేలీ లో  కోవిడ్ కేసులు పెరిగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఎంపీ ల్యాడ్ ఫండ్ కింద ఈ నియోజకవర్గానికి రూ. 1.17 కోట్లను విరాళంగా ప్రకటించారు.

ఎంపీ ల్యాడ్ ఫండ్ కింద కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రూ. 1.17 కోట్ల విరాళం, ఎందుకంటే ?
Sonia Gandhi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Apr 24, 2021 | 10:23 PM

యూపీలోని తన లోక్ సభ నియోజకవర్గం రాయ్ బరేలీ లో  కోవిడ్ కేసులు పెరిగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఎంపీ ల్యాడ్ ఫండ్ కింద ఈ నియోజకవర్గానికి రూ. 1.17 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను కోవిడ్ రోగుల చికిత్సకు అవసరమయ్యే మందులు, తదితరాల కొనుగోలుకు వినియోగించాలని ఆమె  రాయ్ బరేలీ జిల్లా మేజిస్ట్రేటుకు రాసిన లేఖలో కోరారు.  సెకండ్ కోవిడ్ ఉధృతి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవలసిన బాధ్యత తమపై ఉందని ఆమె అన్నారు. డెడ్లీ పాండమిక్ నుంచి రాయ్ బరేలీని రక్షించాల్సి ఉందన్నారు. దేశంలో ఈ  సంక్షోభాన్ని బీజేపీ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని ఆమె ఇటీవల ఆరోపించారు. వ్యాక్సినేషన్ కి అవసరమైన వయో పరిమితిని తగ్గించాలని కూడా ఆమె కోరారు. కాగా మే 1 నుంచి ఈ వయో పరిమితిని ప్రభుత్వం 18 ఏళ్లకు పైగా అంటూ పెంచింది.

అటు- మరికొంతమంది ఎంపీలు కూడా తమ ఎంపీ ల్యాడ్ ఫండ్  నుంచి ఇలాగే తమ నియోజకవర్గాలకు నిధులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Indonesia Sub Marine: ఆ జలాంతర్గామి కథ ముగిసినట్టే..అందులోని 53 మంది బ్రతికి ఉండటం కష్టమే..ఇండోనేషియా నేవీ చీఫ్ మార్గోనో!

Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..!