AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account:సేవింగ్స్ ఎకౌంట్ లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే.. షరతులు వర్తిస్తాయి!

చాలా మంది బంకుల్లో డబ్బులు దాచుకుంటారు. చిన్న మొత్తాలు పొదుపు ఖాతాల్లో (సేవింగ్స్ ఎకౌంట్స్) లో మదుపు చేస్తుంటారు. అయితే, ఈ ఎకౌంట్ లో బ్యాంకులు వడ్డీ తక్కువగా ఇస్తుంటాయి.

Bank Account:సేవింగ్స్ ఎకౌంట్ లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే.. షరతులు వర్తిస్తాయి!
Savings Account
KVD Varma
|

Updated on: Apr 24, 2021 | 5:31 PM

Share

Bank Account: చాలా మంది బంకుల్లో డబ్బులు దాచుకుంటారు. చిన్న మొత్తాలు పొదుపు ఖాతాల్లో (సేవింగ్స్ ఎకౌంట్స్) లో మదుపు చేస్తుంటారు. అయితే, ఈ ఎకౌంట్ లో బ్యాంకులు వడ్డీ తక్కువగా ఇస్తుంటాయి. కానీ, కొన్ని చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి, ఇది చాలా బ్యాంకుల స్థిర డిపాజిట్ రేట్ల కంటే ఎక్కువ. కానీ ఇవి షరతులతో ఈ డిపాజిట్లపై వడ్డీరేటు ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ వినియోగదారులు 5% నుంచి 7.25% మధ్య వడ్డీ రేట్లు పొందవచ్చు. మీ ఎకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ కనుక లక్షరూపాయల వరకూ ఉంటే, 5 శాతం వడ్డీ రేట్ ఇస్తుంది ఉత్కర్ష బ్యాంక్. ఒకవేళ లక్ష నుంచి 25 లక్షల వరకూ ఉంటె కనుక 6 శాతం ఇస్తుంది. 25 లక్షల కన్నా ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఈ బ్యాంకు నుంచి 7.25 శాతం వడ్డీ పొందవచ్చు. సరాసరి మినిమమ్ ఎవరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ ఎకౌంట్ ను బట్టి మారుతుంది. సాధారణ సేవింగ్స్ ఎకౌంట్ కు ఇది 5 వేల రూపాయలుగా ఉంటె.. ప్రీమియం సేవింగ్స్ ఎకౌంట్ కు 50 వేలుగా ఉంది.

ఇక ప్రయివేట్ బ్యాంకుల్లో బంధన్ బ్యాంక్ 7.15%, ఆర్బిఎల్ బ్యాంక్ 6.5%, ఐడీఎఫ్సి బ్యాంక్6% వడ్డీని పొదుపు ఖాతాలపై అందిస్తున్నాయి. పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవడం ద్వారా ఈ వడ్డీరేటు పొందోచ్చని తమ వినియోగదారులకు ఆయా బ్యాంకులు చెబుతున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ తన డిజిటల్ కస్టమర్లకు ఎకౌంట్ లో కనీసం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకూ బేలెన్స్ ఉంచితే 6.5% వడ్డీ రేటు ఇస్తామని తన వెబ్సైట్ లో పేర్కొంది. లక్ష రూపాయల వరకూ బేలెన్స్ ఉంటె కనుక 4.75%, అదే లక్ష రూపాయల నుంచి పడి లక్షల వరకూ బేలెన్స్ ఉంచితే కనుక 6% వడ్డీ రేట్లను ఈ బ్యాంకు ఆఫర్ చేస్తోంది.

అలాగే బంధన్ బ్యాంక్ విషయానికి వస్తే 50 కోట్ల రూపాయల కంటె ఎక్కువ బేలెన్స్ ఉంచిన వారికీ 7.15% వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా లక్ష రూపాయల లోపు రోజువారీ బేలెన్స్ ఉంటె 3% వడ్డీ, లక్ష నుంచి 10 కోట్ల వరకూ 6 శాతం వడ్డీ ఈ బ్యాంకు అందిస్తోంది.

అదేవిధంగా ఐడీఎఫ్సి బ్యాకు కూడా కోటిరూపాయల బ్యాలెన్స్ ఉన్నవారికి 6 శాతం వడ్డీ ఇస్తోంది. కోటి నుంచి ఐదు కోట్ల రూపాయల వరకూ బేలెన్స్ ఉంచిన వారికి 5% వడ్డీ రేట్ ఆఫర్ చేస్తోంది.

ఇక పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే ఐడీబీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఎక్కువ వడ్డీరేటును పొదుపు ఖాతాలపై అందిస్తున్నాయి. 50 లక్షల నుంచి 100 కోట్ల వరకూ ఉండే డిపాజిట్లపై ఈ బ్యాంకులు 3.5% వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి.

Also read: YouTube: యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి శుభవార్త.. ఎకౌంట్ డిటైల్స్ మార్చకుండానే ఛానల్ పేరు మార్చుకోవచ్చు!

Art of a child: టీచర్ చిన్నబుచ్చింది.. అమ్మ ఆలోచించింది.. వాళ్ళు ప్రోత్సహించారు..ఆరేళ్ళ చిన్నారి అద్భుత పెయింటర్ అయింది!

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?