LPG Gas Cylinder: ఎలాంటి అడ్రస్‌ ఫ్రూఫ్‌ లేకుండా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌

LPG Gas Cylinder: ప్రస్తుతం కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే అడ్రస్‌తో పాటు ఇతర ఫ్రూప్స్  అవసరం. అన్ని పత్రాలు ఉంటేనే కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తారు. కానీ తాజాగా ఎలాంటి.

LPG Gas Cylinder: ఎలాంటి అడ్రస్‌ ఫ్రూఫ్‌ లేకుండా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌
Lpg Gas Cylinder
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2021 | 2:57 PM

LPG Gas Cylinder: ప్రస్తుతం కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే అడ్రస్‌తో పాటు ఇతర ఫ్రూప్స్  అవసరం. అన్ని పత్రాలు ఉంటేనే కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తారు. కానీ తాజాగా ఎలాంటి అడ్రస్‌ ఫ్రూఫ్‌ లేకుండానే గ్యాస్‌ కనెక్షన్‌ను పొందవచ్చు. రాబోయే రోజుల్లో ఇలాంటి సదుపాయం కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇది అమలు అయితే మోడీ సర్కార్‌ పెద్ద ఉపశమనం కలిగించినట్లు అవుతుంది. అయితే దేశంలో 100 శాతం గృహాల్లో ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకోసం పెట్రోలియం మంత్రిత్వశాఖ, ప్రభుత్వ చమురు కంపెనీల స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కలిసి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నివేదికను తయారు చేస్తున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీలో సామాన్యుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకురాబోతోంది ప్రభుత్వం.

అయితే ఈ విధానం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్‌ పొందాలంటే మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే ఇంటి చిరునామా, ఆధార్‌, పాన్‌ లేదా ఓటరు ఐడి కార్డు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లయి మీరు ఉంటున్న ఇంటి ఆడ్రస్‌ ఫ్రూఫ్‌ , లేదా కరెంటు బిల్లు తదితర జిరాక్స్‌లు కావాల్సి ఉంటుంది. ఇక నుంచి కొత్త గ్యాస్ కనెక్షన్‌ పొందాలంటే వినియోగదారులు శాశ్వత చిరునామా అందించాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేదలకు కోటి ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందిస్తామని ప్రకటించింది. మీరు ఉజ్వల స్కీమ్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఉచిత కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సైట్ నుంచి ఫామ్ డౌన్ లోడ్ చేసుకొని.. మీ దగ్గరిలోని గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి సమర్పిస్తే మీకు కనెక్షన్ లభిస్తుంది. ఆధార్, జన్ ధన్ ఖాతా వంటి కేవైసీ డాక్యుమెంట్లు కూడా అందించాల్సి ఉంటుంది.

ఎలాంటి అడ్రస్‌ ఫ్రూఫ్ లేకుండా గ్యాస్‌ కనెక్షన్‌ అమలైతే ఎంతో మందికి మేలు జరుగుతుంది. సొంతూళ్లను వదిలి ఇతర ప్రాంతాల్లో నివసించే వారు చాలా మంది బ్లాక్‌లో గ్యాస్‌ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. వారు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ పొందాలంటే అడ్రస్‌ ఫ్రూప్‌ కావాల్సి ఉంటుంది. అద్దె ఇళ్లల్లో ఉండేవారికి వారికి అడ్రస్‌ ఫ్రూఫ్ పత్రాలు కావాలంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

ఇవీ చదవండి: Gas Cylinder: మీరు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!