లక్షల్లో జీతం వచ్చే జాబ్ వదిలేశాడు.. ఆ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు..

ఈ మధ్యకాలంలో చాలామంది లక్షల్లో సంపాదన వచ్చినా కూడా వాటిని వదిలేసి... సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయం చేసుకోవడం.. యూట్యూబ్ క్రియేటర్లుగా కూడా మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి కోవలోకే వస్తాడు టీ కేఫ్ చైన్ ‘చాయోస్’ వ్యవస్థాపకుడు నితిన్ సలూజా. ఇతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో చదవుకున్నాడు.

లక్షల్లో జీతం వచ్చే జాబ్ వదిలేశాడు.. ఆ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు..
Nithin Saluja
Follow us
Aravind B

|

Updated on: Aug 27, 2023 | 11:40 AM

ఈ మధ్యకాలంలో చాలామంది లక్షల్లో సంపాదన వచ్చినా కూడా వాటిని వదిలేసి… సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయం చేసుకోవడం.. యూట్యూబ్ క్రియేటర్లుగా కూడా మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి కోవలోకే వస్తాడు టీ కేఫ్ చైన్ ‘చాయోస్’ వ్యవస్థాపకుడు నితిన్ సలూజా. ఇతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో చదవుకున్నాడు. తన చదువు పూర్తయ్యాక అమెరికాకి వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. లక్షల్లో ప్యాకేజీ ఉన్నప్పటికీ నితిన్‌ మాత్రం సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఇక చివరికి ఇండియా వచ్చేశాడు. ఆ తర్వాత నితిన్ తన ఆలోచనలను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అతి తక్కువ కాలంలోనే తన వ్యాపారం ఆదాయం కోట్లకు పెరిగిపోయింది.

మొదటగా నితిన్‌ తన స్టార్టప్ బిజినెస్‌లో అనేక కష్టాలను అనుభవించాడు. అయితే పట్టు విడవకుండా..తన సంకల్పంతో సంస్థను విజయ శిఖరాలకు తీసుకెళ్లాడు. మనదేశంలో స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా లాంటి కాఫీ షాపుల ఆధిపత్యం ఉంది. కానీ ‘కెయోస్’ తో తనకంటూ ఓ పేరు తెచ్చుకునేలా నితిన్‌ నిరంతరాయంగా పని చేశాడు. ఇప్పుడు ఇది ఇండియాలోనే ప్రముఖ టీ కేఫ్ కంపెనీగా అవతరించింది. నితిన్ సలుజా స్థాపించిన ‘కెయోస్’ అతి తక్కువ కాలంలోనే రూ. 100 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీగా మారిపోయింది. ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన నితిన్ సలూజా చదువు పూర్తయ్యాక ఓ అమెరికన్ కంపెనీకి కార్పొరేట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అప్పటికే నితిన్ జీతం లక్షల్లో ఉండేది. కానీ నితిన్, అతని భార్యకు అమెరికాలో టీ అమ్మే వారెవరూ కనిపించలేదు. ఇక ఉద్యోగంతో సంతృప్తి చెందక సొంతంగా కేఫ్‌ను తెరవాలని భావించాడు. జాబ్ వదిలేసి ఇండియా వచ్చాడు. సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాడు. ఇండియాలో కాఫీ అందించే అనేక కేఫ్‌లు ఉన్నాయని.. కానీ అవి టీ అందించడం లేదని నితిన్ భావించాడు.

భారతదేశంలోని ప్రజలు అనేక రకాల టీ లను ఆస్వాదిస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకున్న నితిన్ ఇండియాలో టీ తాగేవారి అవసరాలను తీర్చగల టీ కేఫ్‌ను ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. 2012లో నితిన్, అతని స్నేహితుడు రాఘవ్ కలిసి ‘చాయోస్‌’ని స్థాపించారు. వారు గురుగ్రామ్‌లో మొదటి కేఫ్‌ని స్టార్ట్ చేశారు. కస్టమర్లకు ‘మేరీ వాలీ చాయ్’ అందించడం మొదలుపెట్టారు. నితిన్ మొదట్లో తానే స్వయంగా ఆర్డర్లు తీసుకుని, టీ తయారుచేసి అందిస్తుండేవాడు. ఇక కరోనా సమయంలో ‘చాయోస్’ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే మళ్లీ తిరిగి ట్రాక్‌లో పడింది. నితిన్ పడ్డ శ్రమకు ఫలితం దక్కింది. 2020లో కంపెనీ 100 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, చండీగఢ్, పూణేలలో కూడా నితిన్‌ చాయోస్ స్టోర్లు ప్రారంభించాడు. నేడు భారతదేశం అంతటా 200కు మించిన చాయోస్ కేఫ్‌లు ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!