Winter Tips: శీతాకాలంలో మీ డైట్‌లో ఈ సూపర్‌ఫుడ్‌లను చేర్చుకోండి.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు
శీతాకాలంలో చలి తీవ్రంగా ఉంటుంది. దీంతో ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది. అంతేకాదు అలసటగా ఉంటుంది. వీటిని అధిగమించడానికి తినే ఆహారంలో కొన్ని రకాల ఆహారపదార్ధాలను చేర్చుకోవాలి. ముఖ్యంగా అరటి పండు, గింజలు, బెల్లం, పాప్‌కార్న్ , డార్క్ చాక్లెట్‌లను చేర్చుకోండి. ఈ ఆహారాలు మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.
చలి కారణంగా చలికాలంలో తరచుగా అలసిపోతుంటాం. ఏపని చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. ఈ సమయంలో శరీరానికి అదనపు శక్తి అవసరం. తద్వారా మనం మన రోజువారీ పనులను ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. సరైన ఆహారపు అలవాట్లను అనుదరించడం ద్వారా శీతాకాలంలో బద్ధకాన్ని అధిగమించడమే కాదు.. శరీరంలోని శక్తిని కాపాడుకోవచ్చు. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడంలో సహాయపడే ఐదు ఆహారాల గురించి తెలుసుకోండి.
ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. తినే ఆహారంలో వీటిని చేర్చుకోవడం వలన అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తినాలంటే ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ ఆహారాలను చేర్చుకోవాలి.
అరటిపండు: చలికాలంలో అరటిపండు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. పొటాషియం, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న అరటి పండు బద్ధకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కనుక దీనిని తినే ఆహారంలో అల్పాహారంగా లేదా అరటిపండు షేక్ రూపంలో చేర్చుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్‌లు, పెకాన్‌లు వంటి నట్స్ శీతాకాలంలో శరీరంలో శక్తిని నిర్వహించడానికి సహాయపడతాయి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి అలసట లేకుండా చేస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. రోజూ కొన్ని నానబెట్టిన గింజలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి చలిని తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేస్తాయి.
బెల్లం: బెల్లం అనేది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు అలసటను దూరం చేసే సూపర్ ఫుడ్. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉన్న బెల్లం శీతాకాలంలో నీరసం, బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. పంచదార బదులుగా బెల్లాన్ని కూడా స్వీట్ గా తినవచ్చు.
పాప్ కార్న్: తృణధాన్యాలతో తయారు చేసే పాప్‌కార్న్‌లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎక్కువ సమయం శక్తిని అందిస్తాయి. తేలికపాటి ఆలివ్ నూనె, సుగంధ ద్రవ్యాలతో పాప్‌కార్న్‌ను సిద్ధం చేయండి. చలి కాలంలో ఆరోగ్యకరమైన చిరుతిండిగా వీటిని తినండి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు శీతాకాలంలో అలసట, యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. పరిమిత పరిమాణంలో దీనిని తినండి.
అయితే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు.. శరీర స్వభావం గురించి తెలుసుకుని..వాటికీ అనుగుణంగా డ్రై ఫ్రూట్స్, ఇతర వస్తువులను తినే ఆహారంలో చేర్చుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..