Dogs Barking: కొంత మంది వ్యక్తులపై మాత్రమే కుక్కలు ఎందుకు మొరుగుతాయో తెలుసా..
మీ పెంపుడు కుక్క కొంతమంది అతిథులు వచ్చినప్పుడు ఎక్కువగా మొరుగుతుంది.. మరి కొందరు వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు వీధిలో నడుస్తున్న కొంతమందిపై కుక్కలు అకస్మాత్తుగా దూకుతాయి. మరికొందరిని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా..! వాస్తవానికి కుక్క ప్రవర్తన వెనుక మీకు తెలియని అనేక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

పెంపుడు కుక్కలు లేదా వీధి కుక్కలు కొంతమందిని చూసిన వెంటనే మొరగడం మొదలు పెడతాయి. వీలయితే ఆ వ్యక్తుల వెంట పడతాయి. అయితే కుక్కలు తమకు తెలియని వ్యక్తుల చూస్తే మాత్రమే మొరుగుతాయని భావిస్తారు. అయితే దీని వెనుక ఉన్న కథ అంతా ఇది కాదు. కుక్కలకు వాసన, వినికిడి శక్తి ప్రత్యేకం. దీంతో అవి మనుషుల వాసన, మనుషుల నడక విధానాన్ని అర్థం చేసుకుంటాయి. అయితే ఇలా కుక్కలు మొరగడం వెనుక ఉన్న ఆసక్తికరమైన, శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకుందాం..
తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే భావం కుక్కలకు తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే బలమైన భావం ఉంటుంది. ఎవరైనా అపరిచితుడు తమ ప్రాంతంలోకి వచ్చినప్పుడు.. వారిని హెచ్చరించడానికి అవి మొరుగుతాయి. వారు తమ ఇంటికి లేదా కుటుంబానికి ముప్పు అని కుక్కలు భావిస్తాయి. ఒక అపరిచితుడు అకస్మాత్తుగా లేదా త్వరగా తమ వద్దకు వస్తే.. కుక్కలు వారితో తమకు ఇంకా పెద్ద ముప్పుగా భావించి మరింత అధికంగా మొరుగుతాయి.
భయం, అభద్రతతో కూడిన వాతావరణం కొన్ని కుక్కలు భయం వల్ల కూడా మొరుగుతాయి. పెంపుడు కుక్కకు సామాజికంగా శిక్షణ ఇవ్వకపోతే.. అది అపరిచితులను చూసి భయపడుతుంది. ఆ భయం కారణంగా అపరిచితులు తన నుంచి దూరంగా ఉంచేందుకు అది మొరగడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు ప్రజలు అనుకోకుండా కుక్కలను చూసి భయపెడతారు. కుక్కలు తమ వద్దకు అకస్మాత్తుగా దగ్గరకు రావడం లేదా వాటిని చూస్తే.. అటువంటి పరిస్థితిలో.. అటువంటి మనుషులను చూసి కుక్క భయంతో మొరుగుతుంది.
శరీర కదలిక, భాష, వాసన కుక్కలు స్వరం ద్వారానే కాదు శరీర కదలికల ద్వారా కూడా అర్థం చేసుకుంటాయి. ఎవరైనా భయపడితే కుక్కలు ఆ విషయాన్ని వెంటనే పసిగట్టగలవు. ఆ వ్యక్తి వాసన, సంజ్ఞల ద్వారా కూడా ఆ వ్యక్తి భయాన్ని పసిగట్టగలవు. అటువంటి పరిస్థితిలో కుక్కలు తమని మరింత శక్తివంతంగా భావిస్తాయి.. అతనిపై మరింత గట్టిగా మొరుగుతాయి. అంతేకాదు కొంతమంది వ్యక్తుల ప్రవర్తన లేదా దుస్తులు కూడా కుక్కలకు అసౌకర్యంగా అనిపిస్తాయి. ఈ కారణాల వలన కూడా కుక్కలు మొరుగుతాయి.
గత అనుభవాల కారణంగా కుక్కలు ఎప్పుడూ తమ గత అనుభవాలను గుర్తుంచుకుంటాయి. ఒక వ్యక్తి ఎప్పుడైనా కుక్కను కొట్టినా లేదా భయపెట్టినా.. ఆ కుక్క ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుంటాయి. అలాంటి వారందరి పట్ల మరింత జాగ్రత్తగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు కుక్కలు కొంతమందిని చూసిన వెంటనే స్పందిస్తాయి. ఎందుకంటే ఆ వ్యక్తి వలన తమకు ముప్పుగా ఉండవచ్చని కుక్కలు భావిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








