AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పార్లర్ లేడీ మాయ.. మేకప్ మాయాజాలం చూడాలంటే.. ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

ప్రతి మహిళా అందంగా ఆకర్షణీయంగా, యంగ్ గా కనిపించాలని కోరుకుంటుంది. అయితే యంగ్ లుక్ కోసం కొంతమంది రకరకల టిప్స్ ని పాటిస్తారు. మరొకొందరు అందంగా కనిపించేందుకు మేకప్ ని ఆశ్రయిస్తారు. మేకప్ లో ఉన్న యువతి అందం వెనుక ఏ రూపం దాగుందో తెలుసుకోమని నెటిజన్ల సూచిస్తున్నారు. ఎందుకంటే వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక మహిళకు మేకప్ చేస్తున్నారు. మేకప్ పూర్తి అయ్యాక ఆమె రూపు పూర్తిగా మారిపోయింది. ఇదే మేకోవర్ అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.

Viral Video: పార్లర్ లేడీ మాయ.. మేకప్ మాయాజాలం చూడాలంటే.. ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..
Makeover On The Girl
Surya Kala
|

Updated on: Aug 15, 2025 | 4:05 PM

Share

ఈ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించే వారు వివిధ రకాల వైరల్ వీడియోలను చూస్తూనే ఉంటారు. కొన్నిసార్లు దేశీ జుగాద్ వీడియోలు వైరల్ అవుతుంటే.. కొన్నిసార్లు ఎవరైనా ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొన్ని వీడియోలలో ఫన్నీ డ్రామా ఉంటాయి. మరికొన్నింటిలో వింతగా, ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. ప్రతి ఒక్కరూ వాటిని షేర్ చేయడం ప్రారంభిస్తారు. ఈ రోజుల్లో కూడా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిలో మేకప్ మాయాజాలం కనిపిస్తుంది. కనుక ఈ రోజు వీడియో గురించి తెలుసుకుందాం.

ఈ వైరల్ వీడియోలో ఒక మహిళకు మేకప్ చేస్తున్నారు. వీడియోలో ఆమె ముఖం మొదట మేకప్ లేకుండా చూపించారు. ఈ సమయంలో ఆమె నల్లగా కనిపించింది. ఆమె ముఖం పూర్తిగా సాధారణంగా ఉంది. దీని తరువాత మేకప్ వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొంత సమయం తర్వాత.. ఆ మహిళ ముఖం పూర్తిగా మారిపోయింది. మేకప్ తర్వాత.. ఆమె చాలా భిన్నంగా కనిపించడం మొదలవుతుంది. మేకప్ పూర్తి అయ్యే సరికి ముందు చూసిన మహిళ.. మేకప్ పూర్తి అయిన తర్వాత మహిళ ఒకరేనా అని నమ్మడం కష్టం అవుతుంది. ఎవరైనా మేకప్ కి ముందు ఉన్న మహిళని చూడకుండా.. మేకప్ పూర్తి అయిన మహిళని చూస్తే.. ఇద్దరు ఒకటే అని గుర్తు పట్టడం కష్టం.

ఇవి కూడా చదవండి

ముఖాన్ని మార్చేసిన మేకప్ ఆర్టిస్ట్ ఈ మేకప్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ చాలా గొప్ప పనితనాన్ని చూపించాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడానికి ఇదే కారణం. దీనిని చూసిన తర్వాత ప్రజలు విభిన్నమైన ప్రతిచర్యలు ఇస్తున్నారు. కొంతమంది మేకప్ ఆర్టిస్ట్‌ను ప్రశంసిస్తుండగా.. మరికొందరు తమ అభిప్రాయాన్ని ఫన్నీగా చెబుతున్నారు. ఈ వీడియోను @Babaxwale అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “పార్లర్ చెందిన వ్యక్తులు దేవునికి కొంచెం భయపడండి.. అనే క్యాప్షన్‌ జత చేశారు. ఈ ఒక్క లైన్‌లోనే ఫన్నీ స్టైల్‌ను చూపించారు. ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది చూశారు. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యూటీ పార్లర్ వాళ్ళు చాలా పాపాలు చేస్తారు” అని ఒకరు కామెంట్ చేశారు. ఈ మేకప్ ఆర్టిస్ట్ ని నరకంలో వేడి నూనెలో వేయించాలి” అని ఫన్నీగా కామెంట్ చేశారు. మరొకరు ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ క్షమించ కూడదు అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ వీడియో పలువురుని ఆకట్టుకుంది. సరదాగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..