Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే!
మన గుండె కొన్ని సంవత్సరాల ముందుగానే మనకు హార్ట్‌ఎటాక్ వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుందని మీకు తెలుసా.. దీన్ని విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది నిజం. మన గుండె 10-12 సంవత్సరాల ముందుగానే గుండెపోటు వచ్చే సంకేతాలను సూచిస్తుందట.. కానీ ఈ సంకేతాలను గుర్తించడంలో మనం తరచుగా విఫలమవుతుంటాం. అయితే ఈ గుండెపోటు హెచ్చరిక సంకేతాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెపోటు హెచ్చరిక సంకేతాలు: ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఆకస్మిక గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గుండెపోటుకు ముందు మన శరీరం ఎటువంటి సూచన ఇవ్వదు, అది అకస్మాత్తుగా వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ అభిప్రాయతం తప్పని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మన గుండె కొన్ని సంవత్సరాల ముందే మనకు హార్ట్‌ఎటాక్ సంకేతాలను తెలియజేస్తుందట.. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. హార్ట్‌ఎటాక్ వచ్చే ప్రమాదం గురించి 10–12 సంవత్సరాల ముందుగానే మన గుండే సంకేతాలను ఇస్తుంది, కానీ మనం తరచుగా దానిని గుర్తించడంలో విఫలమవుతాము.
నిపుణులు ఏమంటున్నారు?
హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్‌ల ప్రకారం.. ఒక వేల మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటే.. దాదాపు 12 సంవత్సరాల ముందు నుండి మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా చురుకైన నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి చేసేటప్పుడు మన శరీరం వాటికి సహకరించకపోవడం ప్రారంభిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ, ఈ పనులు చేసేటప్పుడు తేలికపాటి అసౌకర్యం కలగడం సాధారణం. కానీ భవిష్యత్తులో గుండె జబ్బులు రాబోతున్న వ్యక్తులలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందట. కరెక్ట్‌గా ఇంకో రెండేళ్లలో గుండెజబ్బు వస్తుందంటే.. అప్పుడు మీ శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోతుందట.
పరిశోధన ఏమి చెబుతుంది?
JAMA కార్డియాలజీలో ప్రచురించబడిన CARDIA అనే సుదీర్ఘ పరిశోధనలో, యువత నుండి మధ్య వయస్కుల వరకు ప్రజలను ట్రాక్ చేశారు. తరువాత గుండె జబ్బులు వచ్చిన వారి కార్యకలాపాలు సుమారు 12 సంవత్సరాల క్రితం తగ్గడం ప్రారంభించాయని కనుగొన్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




