చింతపండు కీళ్ల నొప్పులకు మంచిదేనా..? ఎవరు తినాలి.. ఎవరు తినకూడదు..?
ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్‌లో చాలా రకాల ఆరోగ్య సలహాలు వస్తున్నాయి. వాటిలో చింతపండు తింటే ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది అనే మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతిదీ నిజం కాకపోవచ్చు. కాబట్టి చింతపండు కీళ్ల నొప్పులకు నిజంగా ఉపయోగపడుతుందా లేదా అనే విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చింతపండులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో పాటు మెగ్నీషియం, పొటాషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు చాలా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఇది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. చింతపండు గింజలను వేయించి పొడి చేసి సూప్, స్మూతీలు, సాస్ లలో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఆర్థరైటిస్‌పై ప్రభావం
చింతపండు విటమిన్ C ఎక్కువగా కలిగి ఉండటం వలన శరీర రోగనిరోధక శక్తి పెరగడానికి సాయపడుతుంది. కొన్ని సహజ చికిత్సల్లో చింతపండు ఉపయోగపడుతుందని భావిస్తున్నప్పటికీ.. దీని ప్రభావం ఎంత అని నిర్ధారించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరం. కాబట్టి దీన్ని ప్రధాన చికిత్సగా కాకుండా.. కేవలం సహాయపడే ఆహారంగా మాత్రమే చూడటం మంచిది.
సైడ్ ఎఫెక్ట్స్
- చింతపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- రక్తం పలుచబరిచే మందులు (Blood Thinners) వాడేవారు.. మీరు ఇలాంటి మందులు వాడుతున్నట్లయితే చింతపండును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే చింతపండు ఈ మందుల ప్రభావాన్ని పెంచవచ్చు. దీని వల్ల రక్తం పలుచబడి, రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
- అలర్జీలు ఉన్నవారు.. కొందరికి చింతపండు తింటే అలర్జీ వస్తుంది. అలాంటి వారు పూర్తిగా చింతపండును మానేయాలి. ఎందుకంటే ఇది ఒంటిపై దద్దుర్లు, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు దారితీస్తుంది.
- ఎక్కువగా తింటే.. చింతపండును మితంగా తింటే మంచిదే కానీ అతిగా తింటే వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు రావచ్చు. కాబట్టి రోజువారీ ఆహారంలో తగినంత మోతాదులోనే తీసుకోవడం మంచిది.
- గుర్తుంచుకోండి ఏదైనా ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు.. మీ డైట్‌లో ఏవైనా మార్పులు చేసే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.
చింతపండు ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఇతర పోషకాలు ఇస్తుంది. ప్రాసెస్ చేసిన చింతపండు ఉత్పత్తుల కంటే తాజా చింతపండు మంచిది. ఎందుకంటే ప్రాసెస్ చేసిన వాటిలో ఎక్కువ సోడియం ఉంటుంది. రోజూవారీ ఆహారంలో చింతపండును కొద్దిగా చేర్చడం ద్వారా దాని లాభాలు పొందవచ్చు. కానీ ముఖ్యంగా యాంటీ-డిప్రెసెంట్ లేదా ఇతర మందులు తీసుకుంటున్నవారు మొదట డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




