Mosquito Lifespan: మనుషుల రక్తం తాగకుండా దోమలు ఎన్ని రోజులు బతకగలవో తెలుసా?
చూడగానే మనకు కోపం తెప్పించే జీవులు.. దోమలు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు దోమ కుట్టడం వల్ల కలవరపడి ఉంటారు. దోమలు చాలా హానికరమైన జీవులు. దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, జ్వరం వంటి వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు ఈ వ్యాధులు మరణానికి కూడా కారణమవుతాయి. కాబట్టి దోమ కాటును నివారించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి..
Updated on: Aug 16, 2025 | 6:03 AM

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. దోమల కారణంగా డెంగీ లాంటి విష జ్వరాలు వేగంగా వ్యాపిస్తాయి. అయితే వీటి బారిన పడకుండా ఉండడానికి మస్కిటో రిపెల్లెంట్, మస్కిటో మ్యాట్.. వంటివి ఉపయోగిస్తుంటాం.

దోమలు మనల్ని కుట్టడం ద్వారా మన రక్తాన్ని పీలుస్తాయి. రక్తం దోమలకు ఒక రకమైన ఆహారం. కానీ ఈ ఆహారం లేకుండా దోమ ఎంతకాలం జీవించగలదు..? ఈ ప్రశ్న మీకెప్పుడైనా వచ్చిందా? దీనికి సమాధానం ఇక్కడ తెలుసుకుందాం..

చూడగానే మనకు కోపం తెప్పించే జీవులు.. దోమలు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు దోమ కుట్టడం వల్ల కలవరపడి ఉంటారు. దోమలు చాలా హానికరమైన జీవులు. దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, జ్వరం వంటి వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు ఈ వ్యాధులు మరణానికి కూడా కారణమవుతాయి. కాబట్టి దోమ కాటును నివారించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఓ అధ్యయనం ప్రకారం ఆడ దోమలు రక్తం తాగకుండా చాలా రోజులు జీవించగలవు. ఒక దోమ రక్తం తాగకుండా దాదాపు ఏడు నుంచి పది రోజులు జీవించగలదు. మగ దోమలు రక్తం తాగవు. ఇవి చెట్లపై ఉంటాయి. కానీ ఆడ దోమలు మాత్రం ప్రత్యుత్పత్తికి మన రక్తం తాగుతుంటాయన్నమాట.

కలుషితమైన చెరువులు, కుంటలకు తోడు అపరిశుభ్రమైన ప్రదేశాలు దోమలకు స్థావరాలుగా మారుతుంటాయి. స్థానిక మున్సిపాలిటీలు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ దోమలు అంతకంటే రెట్టింపు ఉత్పత్తి అవుతూ మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుంటాయి. అందుకే ప్రతి ఇంట్లో దోమల నియంత్రణ తప్పనిసరిగా ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి.




