Vastu Tips: ఇంట్లో పూజ గదికి విశేష ప్రాముఖ్యత ఉంది.. పొరపాటున కూడా ఈ దేవుళ్ళ విగ్రహాలను పెట్టవద్దు.. ఎందుకంటే..
వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం గురించి మాత్రమే కాదు పూజ గదికి సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉంచడం మంచిది. అంతేకాదు పూజ గదిలో పెట్టే విగ్రహాలు, ఫోటోలను నేల మీద కాకుండా.. నేలకు కొన్ని అంగుళాల ఎత్తులో ఉంచాలి. ఈ రోజు పూజ గదిలో ఏ రకమైన విగ్రహాలను ఉంచకూడదు? ఏ విగ్రహాలు పెట్టుకోవడం శుభప్రదమో తెలుసుకుందాం.

ఇంట్లో పూజ గదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తి ప్రవాహాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా, సానుకూలంగా భావించే ప్రదేశం. అందువల్ల పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా, నియమాల ప్రకారం ఉంచడం ముఖ్యం. పూజ గదికి సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. ఇంటి ఆలయంలో ఏ విగ్రహాలు లేదా చిత్రాలను పెట్టుకోవడం శుభప్రదం .. ఏ విగ్రహాలు ఆశుభకరమైనవో కూడా ఇది చెబుతుంది. ఈ రోజు పూజ గదిలో ఏ రకమైన విగ్రహాలను పెట్టుకోవాలి? వేటిని పెట్టుకోవద్దో తెలుసుకుందాం.
పూజ గదికి సంబంధించిన వాస్తు నియమాలు
పూజా స్థలం పవిత్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. పూజ గదిని ప్రతిరోజూ శుభ్రం చేయాలి. ధూళి లేదా అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలి. ఇంటి పూజ గదిలో దేవుళ్ల విగ్రహాలను ఉంచడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. విగ్రహాల సంఖ్యను పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. వాటిని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.
రాధా-కృష్ణ విగ్రహం వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో రాధా కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రేమ, సామరస్యానికి చిహ్నం.
విష్ణువు- శివలింగాన్ని కలిపి ఉంచవద్దు. శ్రీ మహా విష్ణువు , శివలింగాన్ని పూజ గదిలో ఒకే చోట ఉంచకూడదు ఎందుకంటే.. శివ కేశవులిద్దరినీ పూజించే పద్ధతులు విభిన్నంగా ఉంటాయి.
త్రిమూర్తుల విగ్రహాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు , మహేశ్వరుడి విగ్రహాలను లేదా చిత్ర పటాలను కలిపి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవద్దు. వాస్తు నియమాల ప్రకారం ఇది సముచితంగా పరిగణించబడదు.
బెడ్ రూమ్ లో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచవద్దు. వివాహిత జంటలు తమ పడకగదిలో హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి . కనుక హనుమంతుడి విగ్రహాన్ని ప్రత్యేక పూజా స్థలంలో పెట్టుకోవాలి.
చనిపోయిన వారి చిత్రాలను పెట్టవద్దు మరణించిన కుటుంబ సభ్యుల చిత్రాలు లేదా విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు. ఇది పూజ స్థలం స్వచ్ఛతను ప్రభావితం చేస్తుంది.
ఉగ్ర స్వభావం ఉన్న దేవుళ్ల చిత్రాలు కాళికాదేవి, శనీశ్వరుడు, రాహువు, కేతువు వంటి ఉగ్ర స్వభావమున్న దేవతల చిత్రాలను లేదా విగ్రహాలను ఇంట్లోని పూజా గదిలో పెట్టుకోకూడదు. వీటిని ప్రత్యేక ఆచారాలతో ప్రత్యేక స్థలంలో పూజించాల్సి ఉంటుంది.
కోపంగా ఉండే విగ్రహాలు వద్దు పూజ గదిలో ప్రశాంతంగా, సంతోషంగా, ఆశీర్వదించే భంగిమలో మాత్రమే దేవతల విగ్రహాలను పెట్టుకోవాలి. విగ్రహాలను విధ్వంసం రూపంలో లేదా కోపంగా ఉంచే భంగిమలో ఉన్నవి పెట్టుకోవద్దు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.1605588,1605567,1605514,1605485








