Coffee Powder for Hair: చిటికెడు కాఫీ పొడితో.. తెల్ల జుట్టు మాయం!
జుట్టు పొడుగా, ఒత్తుగా ఉండాలని అందరూ ఉండాలి. జుట్టు సంరక్షణ కోసం ఎన్నెన్నో ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాడెక్ట్స్ అందరికీ పడవు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే. ఇంకా అనేక రకాల జుట్టు సమస్యలు ఏర్పడవచ్చు. మీ జుట్టు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మార్కెట్లోకి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సి పని లేదు. కాస్త సమయం తీసుకుని ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ జుట్టు ఆరోగ్యాన్ని..

జుట్టు పొడుగా, ఒత్తుగా ఉండాలని అందరూ ఉండాలి. జుట్టు సంరక్షణ కోసం ఎన్నెన్నో ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాడెక్ట్స్ అందరికీ పడవు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే. ఇంకా అనేక రకాల జుట్టు సమస్యలు ఏర్పడవచ్చు. మీ జుట్టు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మార్కెట్లోకి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సి పని లేదు. కాస్త సమయం తీసుకుని ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. అందలోనూ మారిన ఈ కాలంలో చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతూ ఉంటారు. ఈ వైట్ హెయిర్ కవర్ చేసేందుకు డైలు ఉపయోగిస్తారు. వీటితో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కాఫీ పౌడర్ చక్కగా ఉపయోగ పడుతుంది. కాఫీ పౌడర్‌తో రుచి మాత్రమే కాదు.. జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాఫీ పౌడర్‌తో ఇంకా చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లగా మారుతుంది:
కాఫీ పౌడర్‌ను కొద్దిగా బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వేడి వాటర్ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు బాగా పట్టించి.. కాసేపు ఆరనివ్వండి. ఓ పావు గంట సేపు తర్వాత తలను సాధారణ నీటితో కడిగేసుకోండి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నల్లగా మారుతుంది. తలపై రక్త ప్రసరణ జరుగుతుంది.
చుండ్రు పోవాలంటే..
చాలా మంది చుండ్రుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటివారు కూడా కాఫీ పౌడర్‌తో తగ్గించుకోవచ్చు. ముందుగా జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు కాఫీ తయారు చేసుకుని చల్లారాక.. జుట్టు పై నుంచి పోయండి. ఓ పది నిమిషాలు అలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల తలపై పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. అలాగే తలపై చుండ్రు కూడా తగ్గుతుంది. జుట్టు షైనీగా మెరుస్తుంది.
సిల్కీగా, సాఫ్ట్‌గా అవ్వాలంటే..
జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులా ఉండాలి అనుకునేవారు కొద్దిగా పెరుగు తీసుకోండి. అందులో కొద్దిగా నిమ్మరసం, కాఫీ పౌడర్ వేసి బాగా కలపండి. ఈ పేస్టును తలపై కుదుళ్లు నుంచి చివర్ల వరకు పట్టించండి. ఓ పావు గంట ఆగి హెడ్ బాత్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడటమే కాకుండా.. హెయిర్ సిల్కీగా, సాఫ్ట్‌గా అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




