Health: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా.? ఈ మార్పులు తప్పనిసరి
సాధారణంగా గతంలో జరిగిన విషయాన్ని మరిచిపోవడం సర్వసాధారణం. అయితే నిన్నమొన్న జరిగిన సంఘటనలు కూడా సరిగ్గా గుర్తుండకపోయినా, మర్చిపోతున్నట్లు భావన కలిగినా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, టెన్షన్ లేదా ఇతర అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తున్న మందుల కారణంగా చాలా మంది...

వయసు పెరిగే కొద్దీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుత తరుణంలో మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే అనేక రకాల వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంఇ. మరీ ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్న జీవితం, ఆర్థికపరమైన ఇబ్బందులు వెరసి చాలా మందిలో మానసిక సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యల్లో జ్ఞాపకశక్తి తగ్గడం.
సాధారణంగా గతంలో జరిగిన విషయాన్ని మరిచిపోవడం సర్వసాధారణం. అయితే నిన్నమొన్న జరిగిన సంఘటనలు కూడా సరిగ్గా గుర్తుండకపోయినా, మర్చిపోతున్నట్లు భావన కలిగినా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, టెన్షన్ లేదా ఇతర అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తున్న మందుల కారణంగా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలన్నా, ఈ సమస్య బారిన పడకుండా ఉండాలన్నా కచ్చితంగా జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
* మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే జీవశైలిని యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మెదడుకు కాస్త పని చెప్పాలి. చిన్న చిన్న లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్ ఉపయోగించడం మానేయాలి. అలాగే మెంటల్ గేమ్స్, చెస్, పజిల్స్ సాల్వ్ చేయడం, సుడోకు వంటివి అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
* శారీకంగా కూడా ఆరోగ్యంగా ఉండడమం మానసిక ఆరోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిత్యం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, మెదడు కణాలు కూడా చురుకుగా ఉంటాయి. కాబట్టి ఏ వయసు వారైనా యోగా, నడక తప్పనిసరిగా అలవాటుగా మార్చుకోవాలి.
* ఇక తీసుకునే ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారంలో కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, చేపలు, గుడ్లు తీసుకోవాలి.
* ఆల్కహాల్ అలవాటు ఉన్న వారు వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. ఆల్కహాల్ డీహ్రైడ్రేషన్‌కు దారి తీస్తుంది ఇది మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
* శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో అకస్మాత్తుగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమైతే అది మెదడుకు ఆటంకం కలిగిస్తుంది. ఇది డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది.
* మధుమేహం, బీపీ కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బ తీసేందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవడం ద్వారా బీపీ, షుగర్ బారిన పడకుండా జాగ్రత్తపడాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




