AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memory Power Increase Tips: మెమరీ పవర్ పెరగాలంటే.. ఈ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసమే!

అందరూ ఒకేలా ఉండాలంటే సాధ్య పడదు. ఎవరి శరీరతత్వం, మనస్తత్వం ప్రకారం వారు ఉంటారు. ఇలా చాలా మందిని వేధించే అనారోగ్య సమస్యల్లో మతిమరుపు కూడా ఒకటి. పెట్టిన వస్తువుల్ని, చేయాల్సిన పనులను మార్చిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఎంత గుర్తుకు తెచ్చుకున్నా జ్ఞాపకం రావు. ఇలానే వదిలేస్తే అల్జీమర్స్, డిమెన్షియ వంటి తీవ్ర వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి మెదడుకు అప్పుడప్పుడూ పదును..

Memory Power Increase Tips: మెమరీ పవర్ పెరగాలంటే.. ఈ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసమే!
seeds for brain
Chinni Enni
|

Updated on: Jun 14, 2024 | 2:46 PM

Share

అందరూ ఒకేలా ఉండాలంటే సాధ్య పడదు. ఎవరి శరీరతత్వం, మనస్తత్వం ప్రకారం వారు ఉంటారు. ఇలా చాలా మందిని వేధించే అనారోగ్య సమస్యల్లో మతిమరుపు కూడా ఒకటి. పెట్టిన వస్తువుల్ని, చేయాల్సిన పనులను మార్చిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఎంత గుర్తుకు తెచ్చుకున్నా జ్ఞాపకం రావు. ఇలానే వదిలేస్తే అల్జీమర్స్, డిమెన్షియ వంటి తీవ్ర వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి మెదడుకు అప్పుడప్పుడూ పదును పెట్టే పనులు చేస్తూ ఉండాలి. బ్రెయిన్‌ని ఎప్పుడూ షార్ప్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల మెమరీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మెదడు యాక్టీవ్‌గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. మరి మెమరీ పవర్ పెరిగేందుకు ఎలాంటి పనులు చేస్తే లాభం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

మ్యూజిక్ వినండి:

మ్యూజిక్ వింటే కాసేపు ఎలాంటి వయసు వారైనా.. సరదాగా గడుపుతారు. అప్పటివరకూ ఉన్న ఒత్తిడి, ఆందోళనలను మర్చిపోతారు. సంగీతం వినడం వల్ల బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్ దానంతట అది రిపేర్ చేసుకోవడినిక సంగీతం బాగా హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ వినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా మెరుగు పడుతుంది.

ఒత్తిడిని దూరం పెట్టండి:

ఒత్తిడి కేవలం మానసికంగానే కాదు.. శరీరంపై శరీరంలో ఉండే అన్ని భాగాలపై ప్రభావం చూపిస్తుంది. ఇది మెదడుపై కూడా ఉంటుంది. దీని వల్ల మెదడు పని తీరు అనేది మందగిస్తుంది. ఏకాగ్రత నశిస్తుంది. దీంతో మతి మరుపు కూడా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని దూరంగా ఉంచండి.

ఇవి కూడా చదవండి

యోగా – ధ్యానం:

యోగా – ధ్యానం చేయడం వల్ల మెదడు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇవి మెదడును శాంత పరుస్తాయి. ప్రతి రోజూ ఓ పది నిమిషాలైన లోతైన శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయండి. ఇలా చేయడం వల్ల మెదడు యాక్టివ్ అవుతుంది. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.

కొత్త స్కిల్స్ నేర్చుకోండి:

మెమరీ పవర్ పెరగాలంటే మెదడును ఎప్పుడూ బిజీగా ఉంచాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. పుస్తకాలు చదవడం, ఇష్టమైన ఆటలు ఆడటం, కొత్త భాష నేర్చుకోవడం, క్రాస్ వర్డ్ పజిల్స్ ఆడటం వంటివి చేయడం వల్ల బ్రెయిన్ ఎంతో యాక్టీవ్ అవుతుంది. వీటి వల్ల మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. మతి మరుపు కూడా దూరం అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..