AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reheating Tea Health Risks: టీ లవర్స్‌ బీకేర్‌ఫుల్‌.. రెండోసారి వేడి చేసి తాగుతున్నారా.. ఇక మీ బాడీ షెడ్డుకే!

టీ.. దీన్ని తాగందే జనాలకు రోజు గడవదు.. మార్నింగ్ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సుమారు నాలుగైదు సార్లు టీ తాగుతూ ఉంటారు కొందరు. కొందరైతే ఉదయం కాచిన టీని సాయంత్రం మళ్లీ వేడి చేసుకొని తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి కాచిన టీని రెండోసారి వేడి చేకొని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట.. ఇంతకు ఆసమస్యలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Reheating Tea Health Risks: టీ లవర్స్‌ బీకేర్‌ఫుల్‌.. రెండోసారి వేడి చేసి తాగుతున్నారా.. ఇక మీ బాడీ షెడ్డుకే!
Reheating Tea Bad For Health
Anand T
|

Updated on: Dec 25, 2025 | 1:37 PM

Share

ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడం చాలా మందికి అలవాటు. కొందరికైతే టీ తాగంది రోజే స్టార్ట్ కాదు. ఎందుకంటే టీ అనేది వాళ్లకు ఓ ఎమోషన్. కానీ ప్యూచర్‌ వాళ్లకు ఉన్న ఈ అలవాటే పెను ప్రమాదంగా మారబోతుందని నిపుణులు చెబుతున్నారు. అవును ఈ మధ్యకాలంలో వెలువడిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. మీరు ఒక్కసారి టీని కాచిన తర్వాత.. దాన్ని 15-20 నిమిషాల్లో తాగాలి.. అలా కాదని.. దాన్ని రెండోసారి వేడి చేసుకొని తాగడం అనేది చాలా ప్రమాదం అని చెబుతున్నారు. ఇలా తాగడం ద్వారా కాలేయం, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

టీనీ రెండో సారి వేడి చేసి తాగడం ఎందుకు ప్రమాదకరం

సాధారణంగా టీ కాచిన తర్వాత అందులో మిగిలిపోయే టీ పౌడర్ బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరించారు. జపాన్, చైనా వంటి దేశాలలో ఎక్కువ సమయం నిల్వ చేసిన టీని విషంగా భావిస్తారట.. అవును 24 గంటలకు పైగా నిల్వ చేసిన టీ తాగడం పాముకాటు కంటే ప్రమాదకరమని జపనీయులు అంటున్నారు.

పాలతో చేసే టీ అస్సలు మంచిది కాదు

మన భారతదేశంలో ఎక్కువగా పాలతో చేసే టీనే ప్రజలు తాగుతారు. అయితే పాలు త్వరగా చెడిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి. పాలతో తయారుచేసిన టీని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలకు మించి ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే ఒకటి నుండి మూడు రోజులు నిల్వ చేయవచ్చు, కానీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులోనిల పోషకాలు నశిస్తాయి. అంతేకాదు టీలో ఆమ్లత్వం పెరిగి అది విషమంగా మారే ప్రమాదం ఉంది.

అల్లం టీని మళ్ళీ వేడి చేసి తాగవచ్చా?

చాలా మంది సువాన, టేస్ట్‌ కోసం టీలో అల్లం వేసుకుంటారు. అల్లం టీ పాలు లేకుండా తాగడం సురక్షితమే. కానీ టీని ఎక్కువ సమయం నిల్వ చేసినప్పుడు ఒక సారి దాన్ని తనిఖీ చేయాలి.. ఒక వేళ టీ రంగు మారినా, స్మెల్ వచ్చినా దాని జోలికి వెళ్లకపోవడమే బెటర్. అయితే, రోజుకు 4 నుండి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోవడం వల్ల కొంతమందికి గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది.

ఆయుర్వేదం ఏం చెబుతుంది?

ఆయుర్వేదం ప్రకారం టీని నిల్వ చేయడం లేదా మళ్లీ వేడి చేసి తాగడం వల్ల మన శరీరంలోకి విష పదార్థాలు ప్రవేశిస్తాయి, దీంతో పాటు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. టీని పదే పదే వేడి చేయడం వల్ల దానిలో ఉన్న పోషకాలు నాశనం అవుతాయి. అది ఆమ్లత్గవంగా మారి కడుపులో మంట వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మీరు టీ తాగాలని భావిస్తే, ప్రతిసారీ తాజాగా తయారు చేసుకోవడం ఉత్తమం కానీ ఒకసారి కాచిన టీనే మళ్లీ వేడి చేసుకొని తాగకండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
1 రూపాయికే విమాన టికెట్‌.. ఇండిగో బంపర్‌ ఆఫర్‌..
1 రూపాయికే విమాన టికెట్‌.. ఇండిగో బంపర్‌ ఆఫర్‌..
మీ మొక్కలు వాడిపోతున్నాయా? అయితే ఈ 'చెత్త' ట్రిక్ ఫాలో అవ్వండి..
మీ మొక్కలు వాడిపోతున్నాయా? అయితే ఈ 'చెత్త' ట్రిక్ ఫాలో అవ్వండి..
ఉట్టిపడుతున్న సంక్రాతి శోభ.. ఛలో శిల్పారామం..
ఉట్టిపడుతున్న సంక్రాతి శోభ.. ఛలో శిల్పారామం..
సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో కీలక మార్పులు!
సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో కీలక మార్పులు!
అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా