Weight Loss: బరువు తగ్గేందుకు తెగ కష్టపడుతున్నారా..? ఈ గింజలతో ఈజీగా తగ్గొచ్చు.. ట్రై చేయండి..

Fennel Seeds For Weight Loss: సోంపు గింజల్లో (ఫెన్నెల్‌) అనేక గుణాలు, పోషకాలు దాగున్నాయి. ఇవి అనేక సమస్యలను దూరం చేస్తాయి. అదే సమయంలో చాలా మంది సోపు గింజలను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు.

Weight Loss: బరువు తగ్గేందుకు తెగ కష్టపడుతున్నారా..? ఈ గింజలతో ఈజీగా తగ్గొచ్చు.. ట్రై చేయండి..
Weight Loss
Follow us

|

Updated on: May 18, 2023 | 1:36 PM

Fennel Seeds For Weight Loss: సోంపు గింజల్లో (ఫెన్నెల్‌) అనేక గుణాలు, పోషకాలు దాగున్నాయి. ఇవి అనేక సమస్యలను దూరం చేస్తాయి. అదే సమయంలో చాలా మంది సోపు గింజలను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో నోటి దుర్వాసన పోగొట్టే గుణాలు దీనిలో ఉన్నాయి. మరోవైపు, మీరు ఊబకాయం, త్వరగా బరువు తగ్గాలని భావిస్తుంటే మీరు సోపు సహాయం తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవును, మీరు సోపు తీసుకోవడం ద్వారా మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. సోంపు గింజలను ఎలా ఉపయోగిస్తే త్వరగా బరువు తగ్గుతామో ఇప్పుడు తెలుసుకోండి..

సోంపును ఇలా తీసుకుంటే బరువు తగ్గవచ్చు..

సోంపు వాటర్: మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఈ పద్ధతి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోపు, అర టీస్పూన్ పసుపు వేసి రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత వడగట్టి మరుసటి రోజు తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల మీ బరువు త్వరగా తగ్గడం ప్రారంభమవుతుంది.

తినండి: బరువు తగ్గడానికి మీరు సోపు బాగా నమిలి తినాలి. దీంతో కొద్దిరోజుల్లోనే తేడా కనిపిస్తుంది.అందుకే అధిక బరువు ఉండి.. బరువు తగ్గాలనుకునే వారు ఆహారం తిన్న తర్వాత లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత తినవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సోపు టీ తాగండి: ఫెన్నెల్ టీ బరువు తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. దీన్ని చేయడానికి గిన్నెలో నీరు తీసుకుని దానికి ఒక టీస్పూన్ సోపు, ఒక టీస్పూన్ బెల్లం కలపండి. మరిగిన తర్వాత ఫిల్టర్ చేసి టీ లాగా తాగాలి. మీరు ఈ టీని ఉదయం ఖాళీ కడుపుతో కూడా తాగవచ్చు. ఇది మీ బరువును త్వరగా తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..