AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travelling: ట్రావెలింగ్ చేయడం అంటే మీకు ఇష్టమా.. ఈ టిప్స్ పాటిస్తే ఎన్నో బెనెఫిట్స్.. అవేంటంటే..

భారతదేశంలో పర్యాటక ప్రాంతాలకు కొదవే లేదు. పుణ్య క్షేత్రాలు, తీర్థాలు, చరిత్రాత్మక ప్రాంతాలు, ప్రకృతి సౌందర్య దృశ్యాలు.. ఇలా ఒక్కటేమిటి.. ఊహకందని అనుభూతులు, అనుభవాలు దేశంలో అడుగడుగునా నిక్షిప్తమై ఉండాలి. దేశంలో..

Travelling: ట్రావెలింగ్ చేయడం అంటే మీకు ఇష్టమా.. ఈ టిప్స్ పాటిస్తే ఎన్నో బెనెఫిట్స్.. అవేంటంటే..
Travel
Ganesh Mudavath
|

Updated on: Oct 08, 2022 | 9:54 PM

Share

భారతదేశంలో పర్యాటక ప్రాంతాలకు కొదవే లేదు. పుణ్య క్షేత్రాలు, తీర్థాలు, చరిత్రాత్మక ప్రాంతాలు, ప్రకృతి సౌందర్య దృశ్యాలు.. ఇలా ఒక్కటేమిటి.. ఊహకందని అనుభూతులు, అనుభవాలు దేశంలో అడుగడుగునా నిక్షిప్తమై ఉండాలి. దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. పర్యాటకం, పర్యాటక సంబంధిత కార్యకలాపాలు, ముఖ్యంగా ప్రకృతి సౌందర్యం, పర్యావరణపరంగా సున్నితమైన ప్రదేశాలలో నియంత్రించాలి. అటువంటి ప్రదేశాలను సందర్శించే సందర్శకులు మరింత బాధ్యతతో వ్యవహరించాలి. పర్యాటక ప్రాంతాల సమాజానికి, సంస్కృతికి, పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. పర్యాటకం, ఆతిథ్య పరిశ్రమపై ఆధారపడిన వారు, సందర్శకులే కాకుండా స్థానికంగా ఉండే వారు పర్యావరణ పరిరక్షణ పట్ల దృష్టి సారించాలి. సహజ సాంస్కృతిక పర్యావరణ వ్యవస్థలకు హాని కలగకుండా దీర్ఘకాలికంగా పర్యాటకాన్ని సంరక్షించడానికి, స్థిరమైన ప్రయాణాన్ని అనుసరించాలి. యాత్రికుల తాకిడి కారణంగా పెరుగుతున్న కాలుష్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, పరిసరాలను దుర్గంధంగా మార్చడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధమైన చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఇటీవల జనాదరణ పొందిన ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి ట్రావెలింగ్ కు వెళ్లే సమయంలో మళ్లీ మళ్లీ ఉపయోగించే బ్యాగులను తీసుకెళ్లాలి. ఏదైనా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో అవి ఉపయోగపడతాయో లేదోనని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దుకాణాల్లో చూసే సమయంలో అది ఆకర్షణీయంగా, ఉపయోగించే వస్తువుగా ఎట్రాక్ట్ చేస్తుంది. తీరా కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాక నచ్చకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వాటిని పడేయలేం. ఇంట్లోనూ పెట్టుకో లేం. అందుకే ఏయే వస్తువులను కొనుగోలు చేయాలనే విషయంపై ముందుగానే ఒక ప్రణాళికతో ఉండాలి. లేకుంటే అనవసర ఖర్చులు తప్పవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరానికి సహకరించని ఫుడ్ ను తీసుకుంటే అది తీవ్ర అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి యాత్రికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

విమానంలో కంటే రైలు ప్రయాణం చేయడం తేలిక. అంతే కాదు ట్రావెలింగ్ ఛార్జీలు తక్కువే. కుటుంబంతో కలిసి వెళ్లాలనుకుంటే సొంత వాహనాల్లోనే వెళ్లడం ఉత్తమం. హోటల్‌లు, హాస్టళ్లలో గ్రీన్ సర్టిఫికేషన్‌ లను చెక్ చేయాలి. హోమ్-స్టేలు వంటి స్థానికంగా స్వంతమైన వసతిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో పర్యావరణ అనుకూలమైన వస్తువులను ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అవసరమైన వాటిని మాత్రమే తీసుకువెళ్లాలి. లగేజీ తక్కువ బరువుతో ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టూరిజం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి