AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acidity: కడుపులో మంటగా ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే చాలా డేంజర్..

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో గ్యాస్, కడుపులో మంట, ఛాతిలో మంట, ఆసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల వల్ల ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. వీటిని తాగడం వల్ల సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అసిడిటీ సమస్య రావడానికి..

Acidity: కడుపులో మంటగా ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే చాలా డేంజర్..
జీర్ణ చికిత్సలో ఇంగువ, సోంపు గింజలు బలేగా పని చేస్తాయి. నీళ్లలో 1 టీస్పూన్ ఇంగువ, 1/4 టీస్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత కప్పులో పోసుకుని వేడిగా తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
Chinni Enni
|

Updated on: Sep 26, 2024 | 3:04 PM

Share

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో గ్యాస్, కడుపులో మంట, ఛాతిలో మంట, ఆసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల వల్ల ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. వీటిని తాగడం వల్ల సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అసిడిటీ సమస్య రావడానికి కారణాలు ఏంటి? అసిడిటీ వచ్చినప్పుడు ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అసిడిటీ రావడానికి కారణాలు:

కడుపులో మంట రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, చాలా వేగంగా భోజనం చేయడం, మోతాదుకు మించి తినడం, అధిక బరువు, పొగతాగే అలవాటు, మద్యం సేవించడం, ఒత్తిడి, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా కడుపులో మంట అనేది వస్తుంది. అయితే కడుపులో లేదా గుండెల్లో మంట రాగానే చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిమ్మరసం తీసుకోవద్దు:

కడుపులో లేదా గుండెల్లో మంట రాగానే చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. అరగడం కోసం నిమ్మ రసం తాగుతారు. నిజానికి కడుపులో మంట వచ్చినప్పుడు నిమ్మరసం తాగితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. నిమ్మరసంలోని ఆమ్లతత్వం అన్నవాహికను మరింత ఇబ్బంది పడుతుంది. దీంతీ మంట ఇంకా ఎక్కువ అవుతుంది.

ఇవి కూడా చదవండి

సోడాలు – కూల్ డ్రింక్స్:

కడుపులో, గుండెల్లో మంటగా అనిపించినప్పుడు చాలా మంది సోడా లేదా కూల్ డ్రింక్స్ వంటివి కూడా ఎక్కువగా తాగుతారు. ఇలా తాగడం వల్ల మంట అనేది మరింత పెరుగుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రతరమై ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి కడుపులో, గుండెల్లో మంటగా ఉన్నప్పుడు సోడాలు, కూల్ డ్రింక్స్ తాగకపోవడం చాలా మంచిది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ తాగితే అసిడిటీ తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆపిల్ సైడర్ తాగినా ఎలాంటి మార్పు ఉండదు. ఇంకా దీంతో సమస్య పెరుగుతుంది. కాబట్టి యాసిల్ సైడర్ వెనిగర్ తీసుకోకండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us