వేగంగా బరువు తగ్గాలా.. ఐతే ఈ జ్యూస్ తాగండి!

13 May 2026

TV9 Telugu

TV9 Telugu

జీవనశైలిలో మార్పులు.. తగ్గిన శారీరక శ్రమ.. నిద్ర వేళల్లో తేడాలు.. ఉద్యోగ టెన్షన్లు.. తదితర కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు

TV9 Telugu

ఈ సమస్య పరిష్కరించుకోవడానికి తేలికైన మార్గం ఉందని చెబుతున్నారు. కీర దోస జ్యూస్ సరైన పరిష్కారం అంటున్నారు. కీర దోస కాయలతో జ్యూస్ చేయడానికి వాటిని ముక్కలుగా కట్ చేయాలి

TV9 Telugu

అయితే, వాటిని కట్ చేస్తున్నప్పుడు తొక్కలు తీయొద్దు. తొక్కలోనూ పలు రకాల పోషకాలు ఉంటాయి. ఈ ముక్కలు మిక్సీ జార్‌లో వేసి, కొన్ని కరివేపాకు ఆకులు, నీరు పోసి మిక్స్ చేసి గ్లాస్ లో తీసుకోవాలి

TV9 Telugu

తాగే ముందు నిమ్మకాయలో సగం చెక్క రసం, కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగాలి. ప్రతి రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగొచ్చు. ఎప్పుడు తాగినా అంతకు ముందు రెండు గంటల పాటు కడుపు ఖాళీగా ఉండాలన్న సంగతి మరిచిపోవద్దు

TV9 Telugu

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించేస్తుంది. శరీరం బరువు కూడా చాలా వేగంగా తగ్గిపోతుంది కూడా. కీర దోసలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఈ జ్యూస్ తాగినప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువగా ఉంటుంది

TV9 Telugu

దీంతో తొందరగా ఆకలి కాదు. దీంతో తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. వేసవిలో కీర దోస ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో కీర దోస తినడం గానీ, జ్యూస్ గానీ తీసుకుంటే డీ హైడ్రేషన్ సమస్య తగ్గుతుంది

TV9 Telugu

ఎండాకాలం ఎక్కువగా లభించే కీర దోస సలాడ్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు. నీటితో కూడిన ఇవి దాహం తీరటానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

జబ్బుల నివారణకు, బరువు అదుపులో ఉండటానికి, జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఎప్పుడంటే అప్పుడు తినటానికి అనువుగా ఉండటం వల్ల దోసకాయ ప్రయోజనాలను ఎవరైనా, ఎక్కడైనా పొందొచ్చు