AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ లివర్ మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం.! ఎవరెవరు తినకూడదంటే

కోడి లేదా మేక లివర్‌లో విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు అపారంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే ‘హీమ్ ఐరన్’ను మన శరీరం చాలా త్వరగా గ్రహిస్తుంది. విటమిన్ బి12 అధికంగా ఉండటం వల్ల నరాల బలహీనతను తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

మటన్ లివర్ మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం.! ఎవరెవరు తినకూడదంటే
Mutton Liver
Ravi Kiran
|

Updated on: May 14, 2026 | 11:29 AM

Share

మాంసాహారం తినే వారిలో చాలా మందికి లివర్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. కోడి లేదా మేక కాలేయంలో విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ధృవీకరించింది. అయితే, “జంతువుల లివర్ తింటే మన లివర్ ఆరోగ్యంగా ఉంటుంది” అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు, వైద్య నిపుణులు చెబుతున్న జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్‌లో మన శరీరం త్వరగా గ్రహించగలిగే ‘హీమ్ ఐరన్’ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల తయారీకి, నరాల ఆరోగ్యానికి, మెదడు ఎదుగుదలకు ఎంతో అవసరం. పాలు, గుడ్లు, చేపల కంటే కూడా లివర్‌లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కండరాల మరమ్మతుకు, అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ఇందులో ఉండే ప్రోటీన్లు ఎంతో దోహదపడతాయి. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అందరూ లివర్‌ను ఒకేలా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లివర్‌ను తినకూడదని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది. దీనికి కారణం అందులో ఉండే అధిక విటమిన్ ఏ. విటమిన్ ఏ మోతాదు మించితే గర్భంలోని శిశువుకు హాని కలిగే ప్రమాదం ఉంది. అలాగే రెండేళ్ల లోపు పిల్లలకు లివర్‌ను అసలు పెట్టకూడదు. 5 నుంచి 10 ఏళ్ల పిల్లలకు వారానికి గరిష్టంగా 50 గ్రాములు, 10 నుంచి 15 ఏళ్ల పిల్లలకు 100 గ్రాముల వరకు మాత్రమే ఇవ్వాలి. వృద్ధులు, ఆస్టియోపోరోసిస్(ఎముకల బలహీనత) ఉన్నవారు కూడా లివర్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.

“లివర్ తింటే మన లివర్ బాగుంటుంది” అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మధుమేహ నిపుణులు డాక్టర్ ప్రశాంత్ అరుణ్ స్పష్టం చేస్తున్నారు. మన కాలేయం తనను తాను శుభ్రం చేసుకోగల శక్తిని కలిగి ఉంటుంది. దానికి వేరే జంతువుల కాలేయం అవసరం లేదు. లివర్‌ను ఫ్రై చేసి తినడం కంటే గ్రేవీ లేదా సూప్ లాగా చేసుకుని తినడం వల్ల అందులోని పోషకాలు నశించకుండా మనకు అందుతాయి. సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం, తగినంత నిద్ర మాత్రమే మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఏదైనా సరే పరిమితంగా తీసుకున్నప్పుడే అది అమృతంలా పనిచేస్తుంది.

Follow Us