AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచిది అనుకుంటే కొంపముంచుతుంది.. ఆపిల్ సైడర్ వెనిగర్‌తో జాగ్రత్త.. డేంజర్ అంట..

ఆపిల్ వెనిగర్ ను యాపిల్ సైడర్ వెనిగర్ గా పిలుస్తారు. యాపిల్‌లను పులియబెట్టిన తర్వాత ఈస్ట్, చక్కెర కలపడం ద్వారా తయారుచేస్తారు. పాశ్చాత్య దేశాలలో, ఇది సలాడ్ డ్రెస్సింగ్, ఊరగాయలు, మెరినేడ్ల కోసం వంటలో విస్తృతంగా ఉపయోగిస్తారు.

మంచిది అనుకుంటే కొంపముంచుతుంది.. ఆపిల్ సైడర్ వెనిగర్‌తో జాగ్రత్త.. డేంజర్ అంట..
Apple Cider VinegarImage Credit source: Getty Images
Shaik Madar Saheb
|

Updated on: Sep 26, 2024 | 1:51 PM

Share

ఆపిల్ వెనిగర్ ను యాపిల్ సైడర్ వెనిగర్ గా పిలుస్తారు. యాపిల్‌లను పులియబెట్టిన తర్వాత ఈస్ట్, చక్కెర కలపడం ద్వారా తయారుచేస్తారు. పాశ్చాత్య దేశాలలో, ఇది సలాడ్ డ్రెస్సింగ్, ఊరగాయలు, మెరినేడ్ల కోసం వంటలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా బాగా ఫేమస్ అయిపోయింది. అనేక అధ్యయనాలలో ఇది ఆరోగ్య కోణం నుంచి చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా వినియోగిస్తుంటారు.

కానీ యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం (భారతీయ సంప్రదాయ వైద్యం) పై చరక్ సంహితలో దాని నష్టాలను వివరించారు. అటువంటి పరిస్థితిలో మీరు ఆపిల్ వెనిగర్ తీసుకుంటే, మీ శరీరానికి ఏ మేరకు హాని కలుగుతుంది.. ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలను ఆయుర్వేద డాక్టర్ రేఖ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనాలు

యాపిల్ వెనిగర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా రక్షించడంలో, ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పరిగణిస్తారు.

యాపిల్ వినెగర్ ప్రమాదకరమైనది: ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే..

యాపిల్ సౌడర్ వెనెగర్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి వివరించినప్పటికీ.. దీని వినియోగం ప్రమాదకరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలోని చరక్ సంహిత పుస్తకంలో దీని వినియోగం శరీరానికి ప్రమాదకరమని వివరించారు. యాపిల్ వెనిగర్ గుండె, కాలేయం, ప్రేగులను దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. జీర్ణక్రియ దుష్ప్రభావాలు, ఎముకలకు హాని, గొంతు మండటం, చర్మసమస్యలు, ఔషధ పరస్పర చర్యలు ఉంటాయని పేర్కొంటున్నారు.

శరీరం టాక్సిన్స్‌తో నిండిపోతుంది

యాపిల్ సైడర్ వెనిగర్ ఆల్కలీన్ విషయాల విభాగంలో వస్తుంది. ఇది చాలా వేడిగా, పొడిగా, పదునైనదిగా ఉంటుంది. ఇది శరీరంలో బర్నింగ్ సెన్సేషన్‌తో పాటు టాక్సిన్స్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఆయుర్వేద డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్న పోస్ట్..

మరిన్ని హైల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..