పిచ్చి ఆకుల్లానే కనిపిస్తాయి.. కానీ, డయాబెటిస్‌కు పవర్‌ఫుల్ ఔషధం.. అస్సలు వదిలిపెట్టకండి..
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలాముఖ్యం.. అందుకోసం జీవనశైలితోపాటు.. తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి మంచి ఆహారంలో..
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలాముఖ్యం.. అందుకోసం జీవనశైలితోపాటు.. తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి మంచి ఆహారంలో మెంతులు, మెంతి కూర ఒకటి.. వాస్తవానికి మెంతి గింజల ప్రయోజనాల గురించి మీరు చాలాసార్లు వినడమో.. లేదా చదివో ఉంటారు.. కానీ మెంతి ఆకులను తీసుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా…? తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి.. ఉత్తర భారతదేశంలో చాలా మంది ప్రజలు మెంతి పరాటాలను తినడానికి ఇష్టపడతారు.. అయితే ఇది హాని కలిగించని మంచి ఆహార పదార్థం..
అయితే.. రోజూ మెంతి కూర లేదా మెంతి ఆకులను తింటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. మెంతి ఆకులు తినడం వల్ల మధుమేహం ప్రమాదాన్ని తగ్గించువచ్చు. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాల వల్ల డయాబెటిక్ పేషెంట్లకు సరైన ఆహారం..
మెంతికూరలోని ఔషధ గుణాలు
మెంతికూరలో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా మెంతి గింజల్లోని ఔషధ గుణాలపై అనేక పరిశోధనలు జరిగాయి. సౌదీ అరేబియాలోని ఓ యూనివర్శిటీలో నిర్వహించిన ఒక పరిశోధనలో మెంతి గింజల్లో యాంటీడయాబెటిక్, యాంటీకాన్సర్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫెర్టిలిటీ, యాంటీపరాసిటిక్ ల్యాక్టేషన్ స్టిమ్యులెంట్, హైపోకొలెస్టెరోలేమిక్ లక్షణాలు ఉన్నాయని తేలింది.
రోజువారీ ఆహారంలో మెంతులు లేదా మెంతి కూర చేర్చుకోండి
మెంతులు ప్రోటీన్, ఫైబర్ కు గొప్ప మూలం, దాని బయోయాక్టివ్ సమ్మేళనాలు కారణంగా, దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చు. పరిశోధనలో మెంతులు, మెంతికూర అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగపడతాయని.. పలు ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని వివరించారు. రోజువారీ ఆహారంలో మెంతులు చేర్చడం మంచి ఆలోచన అంటూ పరిశోధనలో తెలిపారు.
మధుమేహం చికిత్సలో మెంతులు మేలు చేస్తాయి
డయాబెటిస్‌లో మెంతులు వల్ల కలిగే ప్రయోజనాలపై కూడా పరిశోధనలు జరిగాయి. ఒక వ్యక్తిలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో సంబంధం ఉన్న జీవక్రియ లక్షణాలను తగ్గించడంలో మెంతి వాడకం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీన్ని తీసుకోవడం ద్వారా, రోగుల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. రోగి గ్లూకోజ్ స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది.
మెంతికూర – మెంతులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
ఇన్సులిన్-ఆధారిత టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులలో, వారి రోజువారీ ఆహారంలో 100 గ్రాముల మెంతి గింజల పొడి.. మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది.
మెంతుల ఇతర ప్రయోజనాలు
మెంతిలోని యాంటీవైరల్ లక్షణాలు గొంతు నొప్పికి శక్తివంతమైన హెర్బల్ రెమెడీగా చేస్తాయి. జుట్టు రాలడం, మలబద్ధకం, పేగుల ఆరోగ్యం, కిడ్నీ వ్యాధి, హాట్‌బర్న్, మగ వంధ్యత్వం, ఇతర రకాల లైంగిక బలహీనతలకు చికిత్స చేయడంలో కూడా మెంతులు ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..