Chukkakura Chapati: చుక్కకూరతో చపాతి ఇలా చేశారంటే.. ఆరోగ్యానికి చాలా మంచిది!

సాధారణంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు చపాతీలను తింటూ ఉంటారు. చాలా రకాల పిండ్లతో చపాతీలను తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో గోధుమ పిండి, మిల్లెట్స్‌తో తయారు చేసేవి కూడా ఉంటాయి. చపాతీల్లో చాలా మంది రకరకాల వాటిని కలుపుతూ ఉంటారు. అలాగే కొంత మంది ఆరోగ్యంగా ఉండటం కోసం ఆకు కూరల్ని కలుపుతారు. ఇలా ఆకు కూరలతో తయారు చేసే గ్రీన్ చపాతీ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది పలు రకాల ఆకు కూరలను..

Chukkakura Chapati: చుక్కకూరతో చపాతి ఇలా చేశారంటే.. ఆరోగ్యానికి చాలా మంచిది!
Chukkakura Chapati
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2024 | 8:55 PM

సాధారణంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు చపాతీలను తింటూ ఉంటారు. చాలా రకాల పిండ్లతో చపాతీలను తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో గోధుమ పిండి, మిల్లెట్స్‌తో తయారు చేసేవి కూడా ఉంటాయి. చపాతీల్లో చాలా మంది రకరకాల వాటిని కలుపుతూ ఉంటారు. అలాగే కొంత మంది ఆరోగ్యంగా ఉండటం కోసం ఆకు కూరల్ని కలుపుతారు. ఇలా ఆకు కూరలతో తయారు చేసే గ్రీన్ చపాతీ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది పలు రకాల ఆకు కూరలను కలుపుతారు. వీటిల్లో చుక్క కూర కూడా ఒకటి. చుక్క కూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. చుక్కకూర కలపడం వల్ల చపాతీలు పుల్లగా, రుచిగా ఉంటాయి. అంతే కాదు తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది. ఈ చుక్కకూర చపాతీలను ఏ ఆకు కూరలతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ చుక్కు కూర చపాతీలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చుక్కకూర చపాతీకి కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, చుక్క కూర, ఉప్పు, ఆయిల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం.

చుక్కకూర చపాతీ తయారీ విధానం:

ముందుగా చుక్క కూరను శుభ్రం చేసి.. నీటిలో వేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక చుక్క కూరను తీసి బాగా వేయించు కోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చుక్కకూరను బాగా మగ్గనిస్తే.. నీరంతా పోయి బాగా దగ్గర పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు చపాతీ పిండిలో కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసి కలపాలి. ఈ గోధుమ పిండిలోనే చుక్క కూర మిశ్రమాన్ని కూడా వేసి.. మొత్తం కలిసేలా బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి.. పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు చపాతీని చిన్న ఉండులుగా చేసుకుని.. చపాతీల్లా ఒత్తుకుని పెనంపై బాగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చుక్కకూర చపాతీ సిద్ధం. దీన్ని నాన్ వెజ్ కర్రీస్‌తో తింటే ఇంకా రుచిగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.