గ్యాస్ సమస్యతో బాధపడే వారు పెరుగు తింటే ఏమవుతుంది?
13 May 2026
TV9 Telugu
TV9 Telugu
మనలో చాలా మందికి పెరుగుతో తిననిదే అసలు భోజనం చేసినట్టుగానే ఉండదు. పెరుగు మన శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా మన జీర్ణక్రియకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. మనలో చాలా మంది గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు
TV9 Telugu
అలాంటి వారికి పెరుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ గ్యాస్ లక్షణాలను తగ్గించడమే కాకుండా గ్యాస్ తయారవ్వడానికి గల కారణాలపై కూడా పని చేస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు
TV9 Telugu
ముఖ్యంగా కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడే వారు పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో అధికంగా ఉండే ప్రోబయోటిక్స్ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి
TV9 Telugu
దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ప్రేగుల గుండా సులభంగా కదులుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. తద్వారా ప్రేగుల్లో గ్యాస్ తయారవ్వకుండా ఉంటుంది
TV9 Telugu
పెరుగును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే సూక్ష్మజీవులు మంచి బ్యాక్టీరియాను కాపాడతాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ పునరుద్దరించబడుతుంది. పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడంలో పెరుగు మనకు ఎంతో దోహదపడుతుంది
TV9 Telugu
పెరుగును తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ తయారవ్వడం తగ్గుతుంది. అంతేకాకుండా పొట్టలో తయారైన గ్యాస్ సులభంగా బయటకు పోతుంది. దీంతో కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి
TV9 Telugu
సంక్లిష్టమైన ఆహారాలను సులభంగా జీర్ణం చేయడంలో పెరుగు తోడ్పడుతుంది. పెరుగులోని కొన్ని ఎంజైమ్ లు ఆహారాన్ని వేగంగా, సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఈ ఎంజైమ్‌లు లాక్టోస్‌ను జీర్ణం చేయడంలో సహాయపడతాయి