పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తింటే ఏమవుతుంది? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Krishna
14 May 2026
జైపూర్ ఆయుర్వేద డాక్టర్ కిరణ్ గుప్తా ప్రకారం.. పుచ్చకాయపై ఉప్పు చల్లడం వల్ల ఆ పండులోని సహజ పోషకాలు, పూర్తి ప్రయోజనాలను శరీరం కోల్పోతుంది. పండును కోసిన వెంటనే ఉప్పు లేకుండా తింటేనే శ్రేయస్కరం.
ఉప్పుతో పోషకాలు మాయం
పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఎండల వల్ల శరీరంలో తగ్గే నీటి శాతాన్ని తిరిగి భర్తీ చేయడానికి, శరీరాన్ని చల్లబరచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సమ్మర్‌లో దీనిని తప్పక తీసుకోవాలి.
డీహైడ్రేషన్‌కు చెక్
ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి.
రోగనిరోధక శక్తి
పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
గుండెకు రక్షణ
వేసవిలో వచ్చే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు పుచ్చకాయ మంచి పరిష్కారం. ఇది చాలా తేలికగా జీర్ణమవ్వడమే కాకుండా కడుపును చల్లబరిచి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ
పుచ్చకాయలోని అధిక నీటి శాతం, విటమిన్ సి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా, సహజమైన కాంతితో మెరుస్తుంది.
చర్మానికి సహజ కాంతి
బరువు తగ్గాలనుకునే వారికి పుచ్చకాయ బెస్ట్ ఆప్షన్. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, పైగా నీటి శాతం వల్ల కడుపు నిండిన భావన కలిగి అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.
బరువు తగ్గడం
పండ్లను ప్రకృతి సిద్ధంగా ఎలా లభిస్తాయో అలాగే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. రుచి కోసం ఉప్పు లేదా ఇతర మసాలాలు కలిపితే, ఆ పండు యొక్క అసలు గుణం దెబ్బతినే అవకాశం ఉంది.