Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fat Burning Foods: బాడీలో కొవ్వును కరిగించే ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!

ప్రస్తుతం కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా లేని సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్. బయట దొరికే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడం వల్ల శరీరంలో విపరీతంగా చెడు కొవ్వు అనేది పెరుగుతుంది. దీని వల్ల అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి. హార్ట్ స్ట్రోక్‌తో అప్పటికప్పుడు ప్రాణాలను కోల్పోతున్నారు. అధిక కొవ్వు, చక్కెర ఉన్న పదార్థాలు తినడం..

Fat Burning Foods: బాడీలో కొవ్వును కరిగించే ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
Fat Burning Foods
Follow us
Chinni Enni

|

Updated on: Jul 10, 2024 | 3:13 PM

ప్రస్తుతం కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా లేని సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్. బయట దొరికే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడం వల్ల శరీరంలో విపరీతంగా చెడు కొవ్వు అనేది పెరుగుతుంది. దీని వల్ల అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి. హార్ట్ స్ట్రోక్‌తో అప్పటికప్పుడు ప్రాణాలను కోల్పోతున్నారు. అధిక కొవ్వు, చక్కెర ఉన్న పదార్థాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా ఆరోగ్యకరమైన ఆహారంతో కరగించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే సూపర్ ఫుడ్స్ మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.

ఓట్స్:

ఓట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చెడు కొవ్వును కరిగించడంలో ఓట్స్ చక్కగా పని చేస్తుంది. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఓట్స్‌తో తయారు చేసే ఆహారాన్ని తీసుకోండి. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్:

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో డ్రై ఫ్రూట్స్‌ కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. ముఖ్యంగా, బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి వాటిని తీసుకుంటే చాలా మంచిది. వీటిల్లో ఫైబర్, మినరల్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొవ్వును కరిగించి.. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

గింజలు:

అవిశె గింజలు, గుమ్మడి గింజలు లాంటి గింజలు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. వీటిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి చెడు కొవ్వును కరిగించి.. గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి.

పండ్లు:

పండ్లను కూడా మీ ఆహారంలో భాగం చేసుకుంటే.. అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. పండ్లలో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఏదో ఒక ఫ్రూట్ తినేలా ప్లాన్ చేసుకోండి. బెర్రీస్ జాతికి చెందిన పండ్లు తింటే మరింత లాభం. వీటిని తీసుకుంటూ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..