- Telugu News Photo Gallery Black Pepper Benefits: What Happens to Your Body When You Eat Black Pepper
నల్లగా ఉన్నాయని దూరం పెట్టేరు.. ఈ విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
భారతీయ మసాలా దినుసులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.. ఈ సుగంధ ద్రవ్యాలలో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. పలు చికిత్సలలో వీటిని ఉపయోగిస్తారు.. అలాంటి సుగంధ ద్రవ్యాలలో 'నల్ల మిరియాలు' ఒకటి.. మిరియాలలో అనేక రకాల పోషకాలు దాగున్నాయి.
Updated on: Jul 10, 2024 | 3:58 PM


మసాలా దినుసు మిరియాలలో ఒకటి కాదు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే మన పూర్వీకులు దీనిని సుగంధ ద్రవ్యాలలో రారాజుగా పిలిచేవారు.. మిరియాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.. ఇది అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. నల్ల మిరియాలు దాదాపు అన్ని కూరగాయలలో ఉపయోగిస్తారు. ఇది ఆహారం సువాసనను మెరుగుపరచడంతో పాటు దాని రుచిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే పోషకాలు రోజంతా ఆకలిని మరింత పెంచుతాయి. అందువల్ల, నల్ల మిరియాలు బరువు పెరగాలనుకునే వారికి.. తగ్గాలనుకునే వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.. నల్ల మిరియాలు ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

పసుపుతో కలపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: మిరియాలను పసుపులో కలిపి తీసుకుంటే, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. పసుపు, మిరియాలు కలిపి పాలలో తాగడం వల్ల సాధారణంగా తీవ్రమైన జలుబు నయమవుతుంది. వాస్తవానికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్, అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, శరీరం కూడా సహజంగా ఫిట్‌గా ఉంటుంది.

అన్ని ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాల పొడిని వాడాలని సూచిస్తున్నారు.. దీంతో అనేక రకాల పొట్ట సమస్యలు తీరిపోతాయి.. రోజూ ఆహారంలో కొద్దిగా నల్లమిరియాల పొడిని కలిపి తింటే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఏదైనా సరే మితంగా తింటేనే మంచిది.. లేదంటే దుష్ప్రభావాలు తప్పవు. మంచివే కదా అని మోతాదుకు మించి మిరియాలు తింటే జీర్ణ సమస్యలతోపాటు నోరు, గొంతులో మంట వంటి ఇబ్బందులు వస్తాయి.

అసిడిటీలో ఉపశమనం: మిరియాలు పచ్చిగా తింటే కడుపులోంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ ఆమ్లం ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.. అనేక జీర్ణశయాంతర వ్యాధులను నివారిస్తుంది. అందువల్ల, అన్ని ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాలు జోడించడం చాలా మంచిది.. దీనివల్ల అనేక రకాల పొట్ట సమస్యలు నయమవుతాయి. రోజూ ఆహారంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.




