- Telugu News Photo Gallery Cinema photos Krithi shetty got a chance to act with dulquer salmaan movies
Krithi Shetty: అదృష్టానికి అడ్రస్ ప్రూఫ్‌లా మారిన కృతి శెట్టి.. వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్న బెబమ్మ
అదృష్టానికి అడ్రస్ ప్రూఫ్‌లా మారిపోతున్నారు కృతి శెట్టి. అబ్బా.. అంత అదృష్టం ఎక్కడుంది.. ఉంటే హిట్స్ వచ్చేవిగా.. ఈ మధ్య అన్నీ ఫ్లాపులే వస్తున్నాయి ఇంకెక్కడి అదృష్టం అనుకుంటున్నారు కదా..? మరి అంతే కదా.. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా.. వరసగా ఛాన్సులు వస్తున్నాయంటే లక్కు కాక మరేంటి..? తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఈమె చెంత చేరింది. తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెనలా దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి.
Updated on: Jul 10, 2024 | 4:54 PM

అదృష్టానికి అడ్రస్ ప్రూఫ్‌లా మారిపోతున్నారు కృతి శెట్టి. అబ్బా.. అంత అదృష్టం ఎక్కడుంది.. ఉంటే హిట్స్ వచ్చేవిగా.. ఈ మధ్య అన్నీ ఫ్లాపులే వస్తున్నాయి ఇంకెక్కడి అదృష్టం అనుకుంటున్నారు కదా..? మరి అంతే కదా.. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా.. వరసగా ఛాన్సులు వస్తున్నాయంటే లక్కు కాక మరేంటి..? తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఈమె చెంత చేరింది.

తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెనలా దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. తక్కువ గ్యాప్‌లోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో హిట్స్ కొట్టేసింది. కానీ తర్వాతే ఆమె సినిమా తిరగబడింది. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ.. మొన్నటికి మొన్న మనమే ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.

ఈమె చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేం లేవు. కానీ తమిళ, మలయాళంలో మాత్రం అమ్మడి జోరు బాగానే ఉంది. ముఖ్యంగా మలయాళంలో అజయంతే రాండాం మోషనం సినిమాలో నటిస్తున్నారు.

దీని బడ్జెట్ దాదాపు 90 కోట్లు. ఇక తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు కృతి. తాజాగా దుల్కర్ సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు కృతి. లైఫ్ ఆఫ్ పై లాంటి అవార్డ్ సినిమాకు పని చేసిన సెల్వమని సెల్వరాజ్ దర్శకత్వంలో కాంత అనే సినిమా వస్తుంది.

రానా దగ్గుబాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్‌కు జోడీగా కృతి శెట్టి ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వరసగా ఫ్లాపులు పలకరిస్తున్నా.. ఆ ప్రభావం తన కెరీర్‌పై పడకుండా జాగ్రత్త పడుతున్నారు బేబమ్మ.




