- Telugu News Photo Gallery Cinema photos Samyukta Menon not getting chances in Tollywood even after consecutive hit movies
Samyukta Menon: వరుస హిట్స్ కొట్టినా.. ఛాన్సులు మాత్రం కరువాయే.. ఎందుకంటే ??
ఎంతైనా సినిమా ఇండస్ట్రీ దారుణం బాసూ..! అదేంటి పుసుక్కున అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా..? మరి కాదా మీరే చెప్పండి.. ఒకటి రెండు కాదు ఏకంగా 4 హిట్స్ కొట్టిన బ్యూటీని ఒక్క ఫ్లాప్ రాగానే పూర్తిగా పక్కనబెట్టేసారు మన మేకర్స్. నిజానికి ఆమె హిట్స్‌లో ఉన్నపుడు కూడా పట్టించుకోలేదు. ఇంతకీ ఎవరా అన్ లక్కీ హిట్ హీరోయిన్.. మీరే చూసేయండి..? ఒక్క హిట్ వచ్చిన హీరోయిన్‌నే నిర్మాతలు అస్సలు వదలరు..
Updated on: Jul 10, 2024 | 5:00 PM

ఎంతైనా సినిమా ఇండస్ట్రీ దారుణం బాసూ..! అదేంటి పుసుక్కున అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా..? మరి కాదా మీరే చెప్పండి.. ఒకటి రెండు కాదు ఏకంగా 4 హిట్స్ కొట్టిన బ్యూటీని ఒక్క ఫ్లాప్ రాగానే పూర్తిగా పక్కనబెట్టేసారు మన మేకర్స్. నిజానికి ఆమె హిట్స్‌లో ఉన్నపుడు కూడా పట్టించుకోలేదు. ఇంతకీ ఎవరా అన్ లక్కీ హిట్ హీరోయిన్.. మీరే చూసేయండి..?

ఒక్క హిట్ వచ్చిన హీరోయిన్‌నే నిర్మాతలు అస్సలు వదలరు.. కానీ అదేంటో మరి వరసగా నాలుగు విజయాలు వచ్చిన తర్వాత కూడా సంయుక్త మీనన్‌కు మాత్రం ఇప్పటికీ అవకాశాలు రావట్లేదు. అవునా.. అలా జరక్కూడదే అనుకుంటున్నారు కదా..! కానీ జరుగుతుందిగా.. సంయుక్త విషయంలో ఇదే జరుగుతుంది. డెవిల్ అనే ఒక్క ఫ్లాప్‌తో ఈమె జాతకం తిరగబడిపోయింది.

సంయుక్త మీనన్.. గతేడాది వరకు ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు ఇది. ఒక్కటి రెండు కాదు.. అమ్మడు నటించిన మొదటి 4 సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో సంయుక్త మీనన్ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది.. అసలు ఖాళీ లేకుండా ఉంటుందని అనుకున్నారంతా. కానీ అదేం జరుగుతున్నట్లు కనిపించడం లేదు. కళ్యాణ్ రామ్ డెవిల్ తర్వాత ఈమెకు తెలుగులో ఛాన్సులే రాలేదు.

భీమ్లా నాయక్‌తో 2022లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత విడుదలైన బింబిసార బ్లాక్‌బస్టర్.. ఇక 2023లోనూ సంయుక్త మాయ కొనసాగింది. సార్‌తో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. విరూపాక్షతో అందర్నీ భయపెట్టేసారు. ఇలా అడుగు పెట్టిన ప్రతీ సినిమా బాగానే ఆడింది.

టాలెంట్ ఉంది.. గ్లామర్ షో చేస్తుంది.. అయినా కూడా సంయుక్త మీనన్‌కు ఎందుకు ఆఫర్స్ రావడం లేదనేది అర్థం కాని ప్రశ్నే. వరస హిట్స్ ఇచ్చినా ఈమెకు కోరుకున్న ఛాన్సులైతే రావట్లేదు. డెవిల్ తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. సంయుక్త మీనన్ కెరీర్ గాడిన పడాలంటే.. ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరగాలి. మరి అదెప్పుడు జరుగుతుందో చూడాలి.




