- Telugu News Photo Gallery Cinema photos Ajith Kumar shooting Vidaamuyarchi movie and also going to trips on his bike
Ajith: రెండు పడవల ప్రయాణం చేస్తున్న స్టార్ హీరో
కొందరు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మాకస్సలు టైమ్ దొరకట్లేదు.. ఫ్యామిలీకి టైమ్ ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. కానీ అక్కడో స్టార్ హీరో మాత్రం సినిమాలతో పాటు పర్సనల్ టైమ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. బైక్ టూర్‌లు వేస్తూ.. బిర్యానీలు వండేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నారు. అంతగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా..? ఈ పాట అజిత్‌కు సూట్ అయినట్లు మరెవరికీ సరిపోదేమో..?
Updated on: Jul 10, 2024 | 5:10 PM

కొందరు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మాకస్సలు టైమ్ దొరకట్లేదు.. ఫ్యామిలీకి టైమ్ ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. కానీ అక్కడో స్టార్ హీరో మాత్రం సినిమాలతో పాటు పర్సనల్ టైమ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. బైక్ టూర్‌లు వేస్తూ.. బిర్యానీలు వండేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నారు. అంతగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా..?

ఈ పాట అజిత్‌కు సూట్ అయినట్లు మరెవరికీ సరిపోదేమో..? మొన్నటి వరకు హాస్పిటల్‌లో ఉన్నారు.. ఓ సర్జరీ కూడా అయింది.. అంతలోనే హాయిగా బైక్ వేసుకుని మళ్లీ రైడ్ చేస్తున్నారు. అంతేకాదు.. మరోవైపు సినిమాలు కూడా వరసగా చేస్తున్నారు. ఓవైపు ప్రొఫెషనల్.. ఇంకోవైపు పర్సనల్ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అజిత్. అందుకే ఆయన రూటే సపరేట్ అంటారు అభిమానులు.

ఈ మధ్యే అజిత్‌కు చిన్న సర్జరీ జరిగింది. దాన్నుంచి కోలుకున్న తర్వాత విడాయ ముర్చీ షూటింగ్‌లోనూ పాల్గొన్నారు అజిత్. దాంతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సైన్ చేసారీయన. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి అడుగు పెడుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. విడాముయార్చి దీపావళికి.. గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి 2025కి విడుదల కానున్నాయి.

సినిమాల్లో ఇంత బిజీగా ఉన్నా.. బైక్ ట్రిప్స్‌కు వెళ్తుంటారు అజిత్. ఆ మధ్య స్నేహితులతో మధ్యప్రదేశ్ టూర్ వెళ్లారు ఈ హీరో. అక్కడే ఫ్రెండ్స్ కోసం బిర్యానీ వండిపెట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది కూడా. విడా ముయార్చి షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చింది. దీని తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు అజిత్.

మామూలుగా అయితే ఏడాది ఒక్క సినిమా చేయడానికే అజిత్ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. పైగా రెండూ చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు అజిత్. పర్సనల్ లైఫ్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు తన సినిమాలకు కూడా టైమ్ ఇస్తున్నారు ఈ సూపర్ స్టార్. మొత్తానికి మూడు నెలల్లోనే రెండు సినిమాలతో పలకరించబోతున్నారు అజిత్.




