Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leaf vegetable: ఆరోగ్యానికి.. అండగా ఆకు… వీటి గురించి మీరెప్పునా విన్నారా..?

ఆకుకూరలు చేసే మేలు అంతా ఇంతా కాదు. అయినా మనం తరచుగా కొన్ని రకాల ఆకూకూరలు మాత్రమే వంటల్లో ఉపయోగిస్తాం. కానీ మనకు తెలిసిన ఆకు కూరలు చాలానే ఉన్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం పదండి....

Leaf vegetable: ఆరోగ్యానికి.. అండగా ఆకు... వీటి గురించి మీరెప్పునా విన్నారా..?
Leaf Vegetables
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 10, 2024 | 2:52 PM

ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో ఉపయుక్తం. ఈ మాటను వైద్యులు, పోషాకాహార నిపుణులు పదే, పదే చెబుతుంటారు. అది కూడా సేంద్రీయ పద్దతిలో పెంచి ఆకుకూరలైతే ఇంకా మంచింది. ఆకుకూరల్లో ఎన్నో పోషాకాహార విలువలు కలిగి ఉండటంతో పాటు పలు రకాల సీజనల్ వ్యాధులను ఎదుర్కునేందుకు కావాల్సిన శక్తిని ఇస్తాయి. అయితే ఆకుకూరలు అనగానే మనకు బచ్చలకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర వంటివే ఎక్కువగా కనిపిస్తాయి. మనకు తెలియని ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి.. వాటిని కొన్నింటి గురించి.. అవి వండే విధానం… వాటి ద్వారా అందే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

సెనగాకు కూర

కూరగాయల మార్కెట్‌లో సెనగలతోపాటు… ఆకు కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో మంచి కూర చేసుకోవచ్చు. కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు వేసి.. తోట కూరలానే దీన్ని వండుకోవచ్చు. కూరంతా ఉడికాక.. కొంచెం నిమ్మరసం పిండుకుంటే.. సూపర్ అంతే. ఇందులో ప్రొటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వెయిట్ లాస్‌కి బాగా ఉపయోగపడుతుంది.

 కాకమాచి ఆకు

కాకమాచి ఆకును ఈ సీజన్‌లో తింటే చాలా మంచింది. మంచిగా క్లీన్ చేసిన ఆకు, పప్పును కుక్కర్‌లో వేసిమెత్తగా ఉడికించాలి. తర్వాత ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు వేసి మరోమారు ఉడికించుకోవాలి. ఫైనల్‌గా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లితో తాలింపు వేస్తే..  కర్రీ రెడీ అయిపోయినట్లే… ఇది లివర్ సమస్యలకు చక్కటి మెడిసిన్‌లా ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.

గుంటగలగరాకు 

గుంటగలగరాకుతో చట్నీ చేసుకుని తింటే.. ప్లేటు కూడా నాకేయాల్సిందే. పాన్‌లో ఆయిల్ వేసి వేడెక్కాక.. అందులో  మెంతులు, నువ్వులు, మినపప్పు ఎండుమిర్చి, ధనియాలు మంచిగా వేయించాలి. తర్వాత టమాట ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గించుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి నీట్‌గా క్లీన్‌ చేసుకున్న గుంటగలరాకుని వేసి మగ్గనివ్వాలి. కంప్లీట్‌గా మగ్గాక తగినంత ఉప్పు చేర్చి రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇంగువతో పోపు వేసుకుంటే గుంటగలరాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడి రక్తం బాగా పట్టేందుకు ఉపయోగపడుతుంది. జుట్టు పోషణకు కూడా ఉపకరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో