Snacks: వర్షంలో వేడివేడి బజ్జీలు తినే అలవాటు మీకూ ఉందా?

వర్షాకాలం.. ఆపై చల్లని వాతావరణంలో వేయించిన వేడివేడి బజ్జీలు, పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే కొందరు వర్షం పడిందంటే చాలు అప్పటికప్పుడు వేడివేడిగా ఇష్టమైన స్నాక్స్‌ చేసుకుని తినేస్తుంటారు. నిజానికి ఈ టైంలో ఇవి తింటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది..

|

Updated on: Jul 10, 2024 | 12:28 PM

వర్షాకాలం.. ఆపై చల్లని వాతావరణంలో వేయించిన వేడివేడి బజ్జీలు, పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే కొందరు వర్షం పడిందంటే చాలు అప్పటికప్పుడు వేడివేడిగా ఇష్టమైన స్నాక్స్‌ చేసుకుని తినేస్తుంటారు. నిజానికి ఈ టైంలో ఇవి తింటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.

1 / 5
కానీ చాలా మందికి ఇలా నూనెలో వేయించిన ఆహారం తింటే గుండెల్లో మంట వస్తుంది. కొంతమందికి కడుపులో అసౌకర్యం కూడా ఉంటుంది. నూనెతో చేసిన స్నాక్స్‌ తిన్న తర్వాత కొన్ని నియమాలు పాటిస్తే, అలాంటి సమస్యలు రావు. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
వేయించిన ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఈ అలవాటు శరీరానికి హానికరం. వేయించిన ఆహారం తిన్న అరగంట తర్వాత నీరు త్రాగాలి. అలాగే వేయించిన ఆహారాన్ని తిన్న తర్వాత నిద్రపోకూడదు. ఇది అసౌకర్యాన్ని పెంచుతుంది.

3 / 5
అందుకే వేయించిన ఆహారాలు తిన్న తర్వాత కాసేపు నడవాలి. ఆ తర్వాత నిద్రపోతే సరి. వేయించిన ఆహారం తిన్న తర్వాత గ్రీన్ టీ తాగినా అసౌకర్యం తగ్గుతుంది. గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి.

4 / 5
 వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తింటే అపానవాయువు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్నవారు ప్రోబయోటిక్ ఆహారాన్ని తినడం మంచిది. అంటే స్నాక్స్‌ తిన్న 15-20 నిమిషాల తర్వాత పెరుగు తినవచ్చు. ఇది అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది.

5 / 5
Follow us