AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటు కోడి గుడ్డు వర్సెస్‌ ఫారం కోడి గుడ్డు.. ఏది మన ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?

రోజుకు ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. అల్పాహారంలో కోడిగుడ్డు తీసుకుంటే మంచిది. తరుచూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫారం కోడిగుడ్డైనా.. నాటుకోడి గుడ్డైనా.. పోషకాలు ఒకే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏ గుడ్డు తిన్నా.. పోషకాలు పుష్కలంగా అందుతాయి.

నాటు కోడి గుడ్డు వర్సెస్‌ ఫారం కోడి గుడ్డు.. ఏది మన ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?
Eggs
Jyothi Gadda
|

Updated on: Jul 25, 2025 | 2:29 PM

Share

గుడ్డు పోష్టికాహారం. ఇందులో ఉండే మాంసకృత్తులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ..గోధుమలు, పప్పులు, జియ్యంలోని ప్రోటీన్ విలువతో పోల్చితే గుడ్డులోనే ఇవి ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిలో ప్రోటీన్ల స్థానంలో గుడ్డే మొదటి స్థానంలో నిలిచింది. పప్పుల్లో ఉండే ప్రోటీన్లతో పోల్చితే గుడ్డులోని ప్రోటీన్లే చాలా తొందరగా జీర్ణమవుతాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు మంచిది. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. అయితే, మన రోజువారి ఆహారంలో నాటు కోడి గుడ్డు తినాలా? లేదంటే ఫారం కోడి గుడ్లు తినటం మంచిదా.? అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా

సాధారణ గుడ్లు నాటుకోడి గుడ్లలో ఒకే పరిమాణంలో పోషకాలు ఉంటాయి. కొన్నిసార్లు గుడ్డు పరిమాణంలో తేడా ఉంటుంది. కానీ, వాటి పోషకాల్లో తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో ప్రోటీన్ లోపం ఏర్పడకూడదంటే.. రోజుకు ఒక గుడ్డును తినాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీరి కండరాలు బలంగా ఉండాలంటే తరచుగా గుడ్డును తినాలి. నాటు కోడి మాదిరిగా నాడు కోడిగుడ్లలో ఎక్కువ పోషకాలుంటాయని, అవే బలవర్ధకమైనవని అంటుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. అల్పాహారంలో కోడిగుడ్డు తీసుకుంటే మంచిది. తరుచూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫారం కోడిగుడ్డైనా.. నాటుకోడి గుడ్డైనా.. పోషకాలు ఒకే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏ గుడ్డు తిన్నా.. పోషకాలు పుష్కలంగా అందుతాయి.

ఇవి కూడా చదవండి

అందుకే పెరిగే చిన్నారులకు రోజుకు ఓ కోడిగుడ్డును తినిపించాలి. గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యానికి మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..