AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toothpaste: టూత్‌ పేస్ట్‌తో పెద్ద ముప్పు..! పిల్లలకు తొందరగా ఎఫెక్ట్.. జాగ్రత్త..

Toothpaste: దంతాలను శుభ్రం చేయడానికి వాడే టూత్‌పేస్ట్ చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..! అవును ఇది నిజం. టూత్‌పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్థిపంజర

Toothpaste: టూత్‌ పేస్ట్‌తో పెద్ద ముప్పు..! పిల్లలకు తొందరగా ఎఫెక్ట్.. జాగ్రత్త..
Toothpaste
uppula Raju
|

Updated on: Oct 22, 2021 | 4:40 PM

Share

Toothpaste: దంతాలను శుభ్రం చేయడానికి వాడే టూత్‌పేస్ట్ చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..! అవును ఇది నిజం. టూత్‌పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్థిపంజర ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. ఈ వ్యాధి తరువాత శరీరంలోని ఎముకలు బలహీనపడటం మొదలవుతాయి. దంతాలు కూడా దెబ్బతింటాయి. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల ప్రకారం..

టూత్‌పేస్ట్ వాడుతున్నప్పుడు పిల్లలు మింగకుండా గమనించాలి. ఎందుకంటే టూత్‌పేస్ట్ లోపల ఫ్లోరైడ్ ఉంటుంది. దీనిని తింటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి అధిక ఫ్లోరైడ్‌ ఉన్న నీరు తాగడం వల్ల సంభవిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో టూత్‌పేస్ట్ కూడా కారణం కావొచ్చు. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇది అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది. డాక్టర్ ప్రకారం.. దంతాలను శుభ్రం చేసుకోవడానికి బఠానీ గింజంత పేస్ట్ సరిపోతుంది. టూత్‌పేస్ట్ ముఖ్య ఉద్దేశ్యం దంతాలకు ఫ్లోరైడ్ అందించడం కొన్ని సందర్భాల్లో వాటిని తెల్లబరచటం మాత్రమే.

ఫ్లోరోసిస్ వ్యాధి అంటే ఏమిటి ఫ్లోరోసిస్ రెండు రూపాల్లో వస్తుంది. వీటిలో మొదటిది డెంటల్ ఫ్లోరోసిస్ ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇందులో ఆరేళ్లలోపు పిల్లల దంతాలు పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. రెండోది అస్థిపంజర ఫ్లోరోసిస్ ఇది శరీరంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. దీనిలో మెడ, వీపు, భుజాలు, మోకాళ్లు బలహీనంగా మారవచ్చు. వాటిలో ఎల్లప్పుడూ నొప్పి ఉంటుంది.

ఫ్లోరోసిస్ లక్షణాలు 1. దంతాల పసుపుగా మారడం 2. చేతులు, కాళ్ళలో నొప్పులు ఉండటం 3. పాదం లోపలికి లేదా బయటికి వంపులుగా తిరగడం 4. మోకాళ్ల చుట్టూ వాపు 5. వంగడం లేదా కూర్చోవడం సమస్య 6. భుజాలు, చేతులు, కాళ్ల కీళ్లలో నొప్పులు

జాగ్రత్తలు 1. చాలా చిన్న పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ ఉపయోగించండి. 2. నోరు కడుక్కునేటప్పుడు పిల్లలతో ఉండండి పేస్ట్ మింగకుండా నిరోధించండి. 3. పిల్లలకు అందుబాటులో లేకుండా టూత్ పేస్ట్ దూరంగా ఉంచండి. 4. పిల్లవాడు అవసరమైన దానికంటే ఎక్కువ పేస్ట్‌ని మింగివేసినట్లయితే వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64కు చేరిన మృతుల సంఖ్య

Harassment: ట్రైనింగ్‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన…కేసు నమోదు చేసిన పోలీసులు..

House Collapse: అర్ధరాత్రి కుప్పకూలిన రెండస్థుల భవనం.. నిద్రలోనే ఐదుగురు దుర్మరణం.. మరో ఆరుగురు..