House Collapse: అర్ధరాత్రి కుప్పకూలిన రెండస్థుల భవనం.. నిద్రలోనే ఐదుగురు దుర్మరణం.. మరో ఆరుగురు..

House Collapse: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో రౌజా అర్జన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. అందరూ నిద్రిస్తున్న వేళ రెండంత‌స్తుల భ‌వ‌నం

House Collapse: అర్ధరాత్రి కుప్పకూలిన రెండస్థుల భవనం.. నిద్రలోనే ఐదుగురు దుర్మరణం.. మరో ఆరుగురు..
House Collapse

House Collapse: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో రౌజా అర్జన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. అందరూ నిద్రిస్తున్న వేళ రెండంత‌స్తుల భ‌వ‌నం కూలిపోవ‌డంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మ‌రో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. గురువారం అర్ధరాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్నట్లు జౌన్‌పూర్ పోలీసులు వెల్లడించారు. రౌజా అర్జన్ ఏరియాకు చెందిన క‌మ‌రుద్దీన్‌, జ‌మాలుద్దీన్ ఓ పురాత‌న రెండంత‌స్తుల భ‌వ‌నంలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు భ‌వ‌నం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి కూలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

భవనంలో నిద్రిస్తున్న వావారు.. నిద్రలోనే మ‌ర‌ణించినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షత‌గాత్రుల‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల్లో మ‌హిళ‌, వృద్ధుడు, ఇద్దరు యువ‌కులు, బాలుడు ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఘనట సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ బర్మా, పోలీసు సూపరింటెండెంట్ అజయ్ సాహ్ని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని, బాధితులకు అన్నిరకాల సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి యోగి అధికారులకు ఆదేశాలిచ్చారు.

Also Read:

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో వ్యాపించిన మంటలు.. చిక్కుకున్న జనాలు!

Yogi Adityanath: సీఎం పర్యటనలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్.. నలుగురు పోలీసుల సస్పెండ్.. యూపీలో కలకలం..

Click on your DTH Provider to Add TV9 Telugu