Yogi Adityanath: సీఎం పర్యటనలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్.. నలుగురు పోలీసుల సస్పెండ్.. యూపీలో కలకలం..
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారపార్టీ బీజేపీ సహా.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారపార్టీ బీజేపీ సహా.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భారీ భద్రతా లోపం వెలుగుచూసింది. సీఎం యోగి ఆదిత్యానాథ్ సమావేశానికి ముందు ఓ వ్యక్తి గన్నుతో హల్‌చల్ చేశాడు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు పలువురు అధికారులపై వేటు వేశారు. బస్తీ జిల్లాలో గురువారం జరిగిన సీఎం పర్యటన జరిగింది. అయితే.. బహిరంగ సభ ఆడిటోరియానికి సీఎం యోగి రావడానికి 45 నిమిషాల ముందు లైసెన్సు పొందిన రివాల్వరుతో ఓ వ్యక్తి రావడాన్ని సర్కిల్ ఆఫీసర్ గుర్తించినట్లు బస్తీ జిల్లా ఎస్పీ ఆశిష్ శ్రీవాస్తవ వెల్లడించారు. వెంటనే.. రివాల్వరుతో సీఎం సభ జరిగే ఆడిటోరియానికి వచ్చిన వ్యక్తిని సర్కిల్ ఆఫీసర్ బయటకు తీసుకువెళ్లి విచారించారు.
అయితే.. రివాల్వరుతో వ్యక్తి సీఎం సభ జరిగే ఆడిటోరియానికి రావడంలో ఏడుగురు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నలుగురు పోలీసులను బస్తీ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు పోలీసులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.
Also Read: