AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: వివాదాస్పదంగా మారిన ఆమీర్ ఖాన్ యాడ్‌.. బీజేపీ ఎంపీ తీవ్ర అభ్యంతరం.. కారణం అదేనా..?

Aamir Khan Add: బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్‌ నటించిన యాడ్‌పై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే అభ్యంత‌రం వ్యక్తంచేశారు. హిందువుల్లో అశాంతిని కల్పించే

Aamir Khan: వివాదాస్పదంగా మారిన ఆమీర్ ఖాన్ యాడ్‌.. బీజేపీ ఎంపీ తీవ్ర అభ్యంతరం.. కారణం అదేనా..?
Aamir Khan
Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2021 | 5:13 PM

Share

Aamir Khan Add: బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్‌ నటించిన యాడ్‌పై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే అభ్యంత‌రం వ్యక్తంచేశారు. హిందువుల్లో అశాంతిని కల్పించే బదులు.. అన్నింటిపై అవగాహన కల్పించాలంటూ కర్ణాటకకు చెందిన ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే సూచించారు. టైర్ల కంపెనీ సియెట్ రూపొందించిన యాడ్‌లో.. ఆమీర్ ఖాన్ రోడ్లపై ట‌పాసులు కాల్చవద్దంటూ ప్రజలను కోరుతుంటాడు. అయితే.. ఈ యాడ్ హిందువుల్లో అశాంతిని సృష్టించేలా ఉందంటూ ద సియ‌ట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అనంత్ వర్ధన్ గోయంకాకు 14వ తేదీన ఎంపీ హెగ్డే లేఖ రాశారు. ఎంపీ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. మీ కంపెనీ ఇటీవల ప్రకటించిన ప్రకటనలో అమీర్ ఖాన్ వీధుల్లో పటాకులు కాల్చకండి అంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ స్పందనకు ధన్యవాదాలు. దీంతోపాటు రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.

శుక్రవారం, ముఖ్యమైన పండుగలప్పుడు న‌మాజ్ పేరుతో రోడ్లను బ్లాక్ చేయ‌డం, మ‌సీదుల నుంచి వ‌చ్చే భారీ శ‌బ్ధాల వంటి సమస్యల గురించి కూడా కంపెనీ ప్రస్తావించాలని కోరారు. నమాజ్ సమయంలో రోడ్లను బ్లాక్ చేస్తారని.. అప్పుడు అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటివి ట్రాఫిక్‌లో గంటలకొద్ది నిలిచిపోతున్నాయని హెగ్డే తెలిపారు. అమీర్ ఖాన్ న‌టించిన ఈ యాడ్‌తో హిందువుల్లో అల‌జ‌డి రేగుతోంద‌ంటూ లేఖలో వివ‌రించారు. రాబోయే రోజుల్లో హిందువుల మ‌నోభావాల‌ను కంపెనీ గౌర‌విస్తుంద‌ని ఆశిస్తున్నానంటూ ఎంపీ లేఖలో వివరించారు. అయితే.. ఎంపీ అనంతకుమార్ హెగ్డే అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన యాడ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

వివాదాస్పదంగా మారిన యాడ్ ఇదే..

Also Read:

Yogi Adityanath: సీఎం పర్యటనలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్.. నలుగురు పోలీసుల సస్పెండ్.. యూపీలో కలకలం..

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో వ్యాపించిన మంటలు.. చిక్కుకున్న జనాలు!