AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CP Mahesh Bhagwat: హోంగార్డు తల్లికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాదాభివందనం.. వీడియో

Rachakonda CP Mahesh Bhagwat: పోలీసు అమ‌ర‌వీరుల సంస్మరణ దినోత్సవం సంద‌ర్భంగా అమ‌రుడు హోంగార్డు లింగ‌య్య త‌ల్లి సారమ్మకు రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్

CP Mahesh Bhagwat: హోంగార్డు తల్లికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాదాభివందనం.. వీడియో
Cp Mahesh Bhagwat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2021 | 2:25 PM

Rachakonda CP Mahesh Bhagwat: పోలీసు అమ‌ర‌వీరుల సంస్మరణ దినోత్సవం సంద‌ర్భంగా అమ‌రుడు హోంగార్డు లింగ‌య్య త‌ల్లి సారమ్మకు రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ పాదాభివంద‌నం చేశారు. అంబ‌ర్‌పేట్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన పోలీసు అమ‌ర‌వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో రాచకొండ సీపీ భగవత్ మాట్లాడుతూ.. ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడేది ఒక్క పోలీస్‌ మాత్రమే అని పేర్కొన్నారు. విధినిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ అమర వీరుల త్యాగం స్ఫూర్తిదాయకమని తెలిపారు రాచకొండ పరిధిలో విధి నిర్వహణలో 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని.. వారి సేవలు అజరామరమని పేర్కొన్నారు.

2006లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదరు కాల్పుల్లో ఎస్‌ఐ సిద్దయ్య, ఇద్దరు కానిస్టేబుల్స్‌, హోంగార్డు లింగయ్య అసువులుబాసిన సంగతి తెలిసిందే. అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీ మహేష్‌ భగవత్‌ లింగయ్య తల్లి సారమ్మకు పాదాభివందనం చేసి.. లింగయ్య సేవలను కొనియాడారు. అనంతరం సారమ్మను శాలువా కప్పి సన్మానించారు. దీంతో అమరుల పట్ల సీపీ మహేష్ భగవత్‌కు ఉన్న గౌరవాన్ని అక్కడున్న వారంతా కొనియాడారు.

వీడియో..

Also Read:

100 Crore Vaccination: త్వరలో విదేశాలకు కోవ్యాక్సిన్.. పలు కీలక వివరాలను వెల్లడించిన సీరం సీఈఓ అదర్ పునావాలా

PM Modi Speech Top 10 Points: వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు.. 100 కోట్ల ఘనతే సమాధానం