AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Speech Top 10 Points: వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు.. 100 కోట్ల ఘనతే సమాధానం

వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం నెంబర్ మాత్రమే కాదు అది దేశ ప్రజల బలం.. దేశ చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం.. ఇది నవ భారత విజయం అంటూ దేశ ప్రజలనుద్దేశించి..

PM Modi Speech Top 10 Points: వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు.. 100 కోట్ల ఘనతే సమాధానం
Pm Modi Speech Highlights
Sanjay Kasula
|

Updated on: Oct 22, 2021 | 1:16 PM

Share

PM Modi Speech Highlights: వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం నెంబర్ మాత్రమే కాదు అది దేశ ప్రజల బలం.. దేశ చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం.. ఇది నవ భారత విజయం అంటూ దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు ప్రధాని మోడీ. భారత దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ టార్గెట్‌కు చేరుకున్నామని కొనియాడారు. వీఐపీ సంస్కృతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి టీకాలు అందించామన్నారు. భారత్‌ లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ సవాళ్లతో కూడుకున్నదని, అయితే అన్నింటినీ అధిగమించి విజయవంతంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టామన్నారు. దీని ద్వారా భారత ఫార్మా శక్తి ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇప్పుడు ప్రపంచదేశాలు మనవైపే చూస్తున్నాయన్నారు మోదీ.

ప్రధాని మోడీ ప్రసంగంలోని టాప్ 10 అంశాలు..

1. వంద కోట్ల కొవిడ్ టీకాల మైలురాయిని చేరుకున్నాం. వంద కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైంది.. ఇది ప్రజల విజయం. సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ లక్ష్యంతో సత్ఫలితాలు వచ్చాయి. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్లు అందాయి.

2. కరోనా వ్యాక్సిన్ల ద్వారా భారత్‌ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించామన్నారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి భారత్‌కు అతిపెద్ద సవాలే విసిరింది. ఇంత పెద్ద దేశానికి టీకాలు ఎలా సరఫరా అనేది సవాలే.. ఎన్నో సవాళ్లను అధిగమించి వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్నామని అన్నారు.

3. వ్యాక్సిన్ పంపిణీలో వీఐపీ సంస్కృతికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూశామన్నారు. కరోనా వివక్ష చూపించనప్పుడు.. టీకాలోనూ వివక్ష ఉండకూడదని భావించామన్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్లను అందించామన్నారు

4. మహమ్మారికి వ్యతిరేకంగా దేశ ప్రజల భాగస్వామ్యమే మన మొదటి బలం అని ప్రధాని అన్నారు. దేశం చప్పట్లు కొట్టింది, దీపాలను వెలిగించి దాని సంఘీభావానికి శక్తిని ఇచ్చింది. అప్పుడు కొంతమంది పారిపోతుందా? కానీ మనమందరం దానిలో దేశ ఐక్యతను చూపించాము.

5. 100 సంవత్సరాలలో అతిపెద్ద అంటువ్యాధి రావడంతో భారత్ పోరాడగలదా? ఇతర దేశాల నుండి చాలా వ్యాక్సిన్‌లను కొనడానికి భారతదేశానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? భారతదేశానికి టీకా ఎప్పుడు వస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు ఈ 100 కోట్ల వ్యాక్సిన్ పూర్తి కావడంతో అన్ని ప్రశ్నలకు లభించింది.

6. కరోనా కట్టడికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి దేశ ప్రజలకు లభించింది.రోజుకు కోటి వ్యాక్సిన్లు వేయడమంటే సామాన్య విషయం కాదు.

7. సాంకేతికత వల్ల మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్ల సరఫరా సాధ్యమైందన్నారు. పెద్ద పెద్ద దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఇప్పటికీ సమస్యగానే ఉందన్నారు.

8. దేశ, విదేశాలలో నిపుణులు అనేక ఏజెన్సీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా సానుకూలంగా స్పందిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. నేడు భారతీయ కంపెనీలలో రికార్డు పెట్టుబడులు మాత్రమే కాదు.. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి.

9. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఒక భారతీయుడు కష్టపడి తయారు చేయడం వల్ల ఇది సాధ్యమైందని  పీఎం అన్నారు.

10.  100 కోట్ల డోసులను పంపిణీ చేసినప్పటికీ ఇంకా కోవిడ్ ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే దీపావళి పండుగను దేశ ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని అన్నారు. ఇప్పటికీ పక్క డోసు తీసుకోనివారికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నవారు.. ఇతరులు కూడా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.

ఇవి కూడా చదవండి: PM Narendra Modi: ఇది భారతీయుల విజయం.. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైంది..

Huzurabad By-Election: బహిరంగ సభ కాదు.. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ రోడ్‌షో.. భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు