PM Narendra Modi: ఇది భారతీయుల విజయం.. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైంది..

ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయి. వంద కోట్ల కొవిడ్ టీకాల మైలురాయిని చేరుకున్నాం. వంద కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైంది..

PM Narendra Modi: ఇది భారతీయుల విజయం.. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైంది..
Pm Modi Live
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 22, 2021 | 11:07 AM

వ్యాక్సినేషన్‌లో వంద కోట్ల మైలురాయిని చేరుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఇది ప్రజల విజయం అన్నారు. భారత్‌ లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ సవాళ్లతో కూడుకున్నదని.. అయితే అన్నింటినీ అధిగమించి విజయవంతంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టామన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా దేశంలోని అందరికీ ఉచితంగా టీకా అందించామన్నారు. దీని ద్వారా భారత ఫార్మా శక్తి ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇప్పుడు ప్రపంచదేశాలు మనవైపే చూస్తున్నాయన్నారు ప్రధాని మోడీ.  కరోనా మహమ్మారి భారత్‌కు అతిపెద్ద సవాలే విసిరింది. ఇంత పెద్ద దేశానికి టీకాలు ఎలా సరఫరా అనేది సవాలే. ఎన్నో సవాళ్లను అధిగమించి వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్నాం.

వ్యాక్సిన్ పంపిణీలో వీఐపీ సంస్కృతికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూశామన్నారు. కరోనా వివక్ష చూపించనప్పుడు.. టీకాలోనూ వివక్ష ఉండకూడదని భావించామన్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్లను అందించామన్నారు. సాంకేతికత వల్ల మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్ల సరఫరా సాధ్యమైందన్నారు. పెద్ద పెద్ద దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఇప్పటికీ సమస్యగానే ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో టీకాలు తీసుకోవడానికి ప్రజలు ఇంకా ముందుకు రావట్లేదని .. అలాంటిది మన భారద దేశంలో 100 కోట్ల డోసులు పూర్తి చేసుకోవడం భారతీయులకు గర్వకారణమన్నారు. అది కూడా అందరికీ ఉచితంగానే అందించామన్నారు. సాధారణంగా భారత్‌ను ఎప్పుడూ ఇతర దేశాలతో పోలుస్తుంటారని.. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అందరికీ టీకా సాధ్యమా అని ప్రశ్నించారని.. వారికి భారతీయులు టీకాలు వేసుకుని జవాబు చెప్పారని అన్నారు.

సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ లక్ష్యంతో సత్ఫలితాలు వచ్చాయి. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్లు అందాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో టీకా తీసుకోవడానికి ప్రజలు ఇప్పటికీ ముందుకు రావట్లేదు. భారత్‌లో 100 కోట్లమందికి టీకాలు వేయించగలిగాం. కరోనా కట్టడికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి దేశ ప్రజలకు లభించింది.రోజుకు కోటి వ్యాక్సిన్లు వేయడమంటే సామాన్య విషయం కాదు.

100 కోట్ల డోసులను పంపిణీ చేసినప్పటికీ ఇంకా కోవిడ్ ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే దీపావళి పండుగను దేశ ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని అన్నారు. ఇప్పటికీ పక్క డోసు తీసుకోనివారికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నవారు.. ఇతరులు కూడా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.

ఇవి కూడా చదవండి: PM Narendra Modi Speech: ఈ ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ..

Huzurabad By-Election: బహిరంగ సభ కాదు.. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ రోడ్‌షో.. భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..