Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: అందుబాటులోకి రానున్న మరిన్ని ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే..

Indian Railways: భారతీయ రైల్వే తన మొదటి ఎయిర్ కండీషన్డ్​త్రీ టైర్​ ఎకానమీ క్లాస్​కోచ్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకైన, ఉత్తమమైన..

Indian Railways: అందుబాటులోకి రానున్న మరిన్ని ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Oct 22, 2021 | 10:05 AM

Indian Railways: భారతీయ రైల్వే తన మొదటి ఎయిర్ కండీషన్డ్​త్రీ టైర్​ ఎకానమీ క్లాస్​కోచ్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకైన, ఉత్తమమైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారంభించారు. ఈ కోచ్‌లలో ఛార్జీలు ఏసీ త్రీ-టైర్, నాన్- ఏసీ స్లీపర్ క్లాస్ మధ్య ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన ఈ కోచ్‌ను కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) కపుర్తల నుండి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) లక్నో మధ్య ట్రయల్​ రన్​ కోసం సిద్ధంగా ఉంచారు. ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ(ఆర్‌సిఎఫ్) చేత రూపొందించబడింది. దీని రూపకల్పన 2020 అక్టోబర్‌లో ప్రారంభమైంది. రైళ్లలో ఈ నూతన ఎస్​3 టైర్ ఎకానమీ కోచ్‌లను చేర్చడం ద్వారా ప్రస్తుతం 72గా ఉన్న బెర్త్​ల సంఖ్య 83కి పెరగనుంది. ఇక ఈ ఎకనామీ ఏసీ-3 టైర్‌ రైళ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. సాధారణ టైర్‌ కోచ్‌ల కంటే 8 శాతం తక్కువగా ఎకనమీ ఏసీ-3 ఛార్జీలు ఉంటాయి. అయితే డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఏ జోన్‌కైనా కనీసం 16 నుంచి 18 కోచ్‌లు అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ కోచ్‌లను సెప్టెంబర్‌లో అనేక రైళ్లను జొడించినా.. ఇక మరిన్ని రైళ్లను నడపనుంది.

అదనపు బెర్తులు..

ఈ ఎకనమీ ఏసీ-3 కోచ్‌లో 83 బెర్తులు ఉంటాయి.  అంతేకాక సాధారణ ఏసీ3 టైర్‌ కోచ్‌ల కంటే అదనంగా 11 బెర్తులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణీకుల సామర్థ్యం మరింతగా పెరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి కోచ్‌లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్నేహపూర్వక టాయిలెట్​ను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి డిజైన్‌లో అనేక మార్పులను కూడా చేసింది.

రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం..

ప్రతి కోచ్‌లో మోడరన్​డిజైన్​తో రూపొందించిన సీట్లు, బెర్తులను చేర్చింది. ఫోల్డబుల్ స్నాక్​టేబుల్స్​, వాటర్​ బాటిల్స్, మొబైల్ ఫోన్, మ్యాగజైన్‌ల కోసం ప్రత్యేక హోల్డర్లను అందించింది. స్టాండర్డ్​ సాకెట్‌తో పాటు ప్రతి బెర్త్‌కు వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. మధ్య, ఎగువ బెర్తులను యాక్సెస్ చేయడానికి నిచ్చెనలో ఎర్గోనామిక్‌గా మెరుగైన డిజైన్‌ను కూడా అందించింది. అంతేకాక, మధ్య, ఎగువ బెర్తులలో హెడ్‌రూమ్‌ను పెంచింది.

ఇందులో లాటరీన్​డిజైన్‌ను అందించింది. ప్రయాణికుల సౌకర్యాలలో భాగంగా పబ్లిక్ అడ్రస్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసింది. కోచ్‌లోకి ప్రవేశించే ప్రవేశ ద్వారం సౌలభ్యంగా ఉండేలా మెరుగుపర్చింది. కోచ్ లోపల ప్రకాశించే ల్యుమినిసెంట్ గుర్తులను ఏర్పాటు చేసింది. బెర్త్ నంబర్లు ప్రకాశవంతంగా కనిపించేందుకు ఇల్యుమినేటెడ్ బెర్త్​ ఇండికేటర్స్‌ను ఉంచింది. కోచ్​లోపల మెరుగైన అగ్ని భద్రత చర్యలను కూడా అందించింది. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గతంలో మొత్తం 248 రైళ్లలో ఎసి3 టైర్​ఎకానమీ క్లాస్​ కోచ్‌లను ఏర్పాటు చేయగా, ఈ కోచ్‌ల ఉత్పత్తి ఈ నెల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఇది ప్రయాణికుల సంఖ్య పెరగడానికి, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ రైలు ప్రయాణం ఆహ్లాదకరమైన జ్ఞాపకాల ప్రయాణంగా మారుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

ఇవీ కూడా చదవండి:

Aadhaar Hackathon 2021: ఆధార్‌ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో పాల్గొంటే రూ.3 లక్షలు గెలుచుకోవచ్చు.. కానీ వీరికి మాత్రమే

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంతంటే..!