LIC Mutual Funds: ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి మంచి అవకాశం.. ఐదేళ్లలో రెట్టింపు రాబడి..!
LIC Mutual Funds: డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. చేతిలోని డబ్బును ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడి పొందవచ్చు..
LIC Mutual Funds: డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. చేతిలోని డబ్బును ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడి పొందవచ్చు. ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్ట్ చేయడానికి ఇబ్బంది లేదు. కానీ చేతిలోని డబ్బును ఎక్కడ పెట్టాలనే విషయానికి వచ్చేసరికి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి పొందవచ్చు. ఇక ప్రముఖ సంస్థ అయిన ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి మంచి అవకాశం. డబ్బులు రెట్టింపు చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ సంస్థ ఈక్విటీ, డెట్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టే వివిధ మ్యూచువల్ స్కీమ్‌లను అందిస్తోంది. కొన్ని ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఐదు సంవత్సరాల కాలంలో రెట్టింపు ఆదాయం పొందవచ్చు. ఇందులో 16.5 శాతం నుంచి 18.5 శాతం వార్షిక రాబడిని అందిస్తున్నాయి.
LIC MF లార్జ్ క్యాప్ ఫండ్: ఐదు సంవత్సరాలలో ఎల్‌ఐసీ ఎంఎఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ 16.3 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. మీరు ఐదేళ్ల క్రితం ఈ స్కీమ్‌లో రూ. లక్ష పెట్టుబడి పెడితే మీ డబ్బులు రూ.2.12 లక్షలకు చేరుకుంటుంది. అలాగే ఐదు సంవత్సరాలలో 16.5 శాతం వార్షిక పెట్టుబడిని రిటర్న్ అందిస్తుంది. ఐదు సంవత్సరాలలో ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రూ. లక్షకు రూ.2.14 లక్షలు అవుతుంది. అంతేకాకుండా నెలవారీ రూ.5000 పెట్టుబడితో రూ.5.8 లక్షలు అవుతుంది.
అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి డబ్బులు పెట్టొచ్చు. లేదంటే ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కన్నా చిన్న మొత్తంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లితే ప్రయోజనం పొందవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)లో నెలకు రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి. డెట్ ఫండ్ స్కీమ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 18 శాతంకుపైగా రాబడి పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.