Aadhaar Hackathon 2021: ఆధార్‌ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో పాల్గొంటే రూ.3 లక్షలు గెలుచుకోవచ్చు.. కానీ వీరికి మాత్రమే

Aadhaar Hackathon 2021: యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేయడమే కాదు.. అప్పుడప్పుడు వివిధ రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. అందులో విజేతలకు..

Aadhaar Hackathon 2021: ఆధార్‌ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో పాల్గొంటే రూ.3 లక్షలు గెలుచుకోవచ్చు.. కానీ వీరికి మాత్రమే
Aadhaar Hackathon 2021
Follow us
Subhash Goud

|

Updated on: Oct 22, 2021 | 7:26 AM

Aadhaar Hackathon 2021: యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేయడమే కాదు.. అప్పుడప్పుడు వివిధ రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. అందులో విజేతలకు నిలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తుంటుంది. ప్రస్తుతం అన్నింటికి ఆధారమే ఆధార్‌ కార్డు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ గుడ్‌న్యూస్‌ అందించింది. తాజాగా ఉచితంగానే రూ.3 లక్షల వరకు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ప్రైజ్ మనీ ఉంటుంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం లక్ష్యంగా ఆధార్ ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. అయితే ఇది అందరికి కాదు. ఈ హ్యాకథాన్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆధార్‌ హ్యాకథాన్‌ 2021 సాంకేతికత సమస్యల పరిష్కారానికై ఆధార్‌ బృందం నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమం. కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది.

ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్, ఐడెంటిటీ అండ్ అథంటికేషన్ వంటి థీమ్స్ ఆధారంగా హ్యాకథాన్ ఉంటుంది. ఐదుగురుగా ఒక టీమ్‌గా ఏర్పడవచ్చు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి.

ఆధార్‌ హ్యాకథాన్‌ విజేతలకు రూ.3 లక్షలు

ఈ ఆధార్‌ హ్యాకథాన్‌లో విజేతకు రూ.3 లక్షలు, రన్నర్‌గా నిలిచిన వారికి రూ.2 లక్షలు వస్తాయి. ఇక తర్వాత రెండు టీమ్స్‌కు రూ.లక్ష అందజేస్తారు. అంతేకాకుండా ఆధార్ 2.0 గ్లోబల్ కాన్ఫరెన్స్‌కు ఈ టీమ్స్‌కు ఇన్విటేషన్ ఉంటుంది. అంతేకాకుండా సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.

ఇందులో పాల్గొనే ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. రెండు టీమ్‌లతో ముందుకు వస్తారు. సాంకేతికంగా ఏర్పడే సమస్యలను పరిష్కార మార్గాలను వీరు అన్వేషిస్తారు. ఆధార్‌ చిరునామాను అప్‌డేట్‌ చేసేటప్పుడు సామాన్యుడు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తారు.

ఈ ఆధార్‌ హ్యాకథాన్‌ 2021 కోసం ఎలా నమోదు చేసుకోవాలి..

► ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ఉండే ఆన్‌లైన్‌ ఫారమ్‌లోకి వెళ్లాలి.

► ఆ ఫారమ్ లో మీ బృందం పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మీ ఆధార్‌ నంబర్‌, కళాశాల లేదా యూనివర్సిటీ పేరును నమోదు చేయాలి.

► తర్వాత క్యాప్చార్‌ను ఎంటర్‌ చేసి ఓటీపీని నమోదు చేయాలి.

► అన్ని వివరాలు సరి చూసుకుని రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత టీమ్‌ రెఫరెన్స్‌ నంబర్‌ వస్తుంది. టీమ్‌ పేరుతో నమోదు చేసుకున్న తర్వాత మరికొంత మంది సభ్యుల పేర్లను జోడించవచ్చు. అయితే ఒక బృందంలో ఐదుగురు సభ్యులకంటే ఎక్కువ ఉండకూడదు. అది కూడా బృందం సభ్యులు ఒకే కాలేజీకి చెందినవారై ఉండాలి.

ఇవీ కూడా చదవండి:

Electricity Bills: మీరు కరెంటు బిల్లు చెల్లించాలా..? ఈ యాప్స్‌ ద్వారా సులభంగా కట్టొచ్చు.. ఎలాగంటే..!

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంతంటే..!

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..