AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Bills: మీరు కరెంటు బిల్లు చెల్లించాలా..? ఈ యాప్స్‌ ద్వారా సులభంగా కట్టొచ్చు.. ఎలాగంటే..!

Electricity Bills: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపుల విషయాలలో మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్‌ చెల్లింపులు అయిపోయాయి..

Electricity Bills: మీరు కరెంటు బిల్లు చెల్లించాలా..? ఈ యాప్స్‌ ద్వారా సులభంగా కట్టొచ్చు.. ఎలాగంటే..!
Subhash Goud
|

Updated on: Oct 19, 2021 | 5:54 PM

Share

Electricity Bills: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపుల విషయాలలో మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్‌ చెల్లింపులు అయిపోయాయి. గతంలో లాగా గంటల తరబడి లైన్లలో నిల్చొని బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే ఉండి పనులన్ని చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. అందుకే డిజిటల్​ చెల్లింపు ప్లాట్​ఫామ్‌లుక ఎంతో ఆదరణ పెరుగుతోంది. గూగుల్​పే, పేటీఎం, ఫోన్​పే, భీమ్​ వంటి యాప్స్​ఈ డిజిటల్​ చెల్లింపులకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ యాప్‌లు విద్యుత్​ బిల్లు చెల్లింపు, డీటీహెచ్​రీచార్జ్​, మొబైల్​ రీచార్జ్, గ్యాస్ బుకింగ్, మెట్రో కార్డ్ రీఛార్జ్‌లతో పాటు అనే సర్వీసులను అందిస్తున్నాయి. మీ నెలవారీ విద్యుత్​బిల్లును భీమ్‌, పేటీఎం, ఫోన్​పే ఉపయోగించి ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండి.

భీమ్ యాప్‌ ద్వారా..

భీమ్‌ యాప్‌ ద్వారా అయితే ముందుగా మీ ఫోన్​లో భీమ్‌ (BHIM) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌ను యాడ్​ చేయండి. దీంతో, కేవలం రెండు నిమిషాల్లోనే మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. యాప్‌లోని స్క్రీన్ మధ్యలో ఉన్న ‘పే బిల్స్’​పై క్లిక్​ చేయండి. దానిలోని ఎలక్ట్రిసిటీ బిల్​ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత మీ రాష్ట్ర పరిధిలోని విద్యుత్ డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోండి. ఇన్‌పుట్ బాక్స్‌లో మీ యూజర్ ఐడీని ఎంటర్​చేయండి. దీంతో అక్కడ మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్​అమౌంట్​చూపిస్తుంది. మీ యూపీఐ పిన్​తో బిల్​ పేమెంట్​ పూర్తి చేయండి. వెంటనే మీ బిల్​ పేమెంట్​పూర్తయినట్లుగా మీ మొబైల్‌కు మెసేజ్​వస్తుంది.

గూగుల్​పే:

గూగుల్ పేలో కూడా బిల్లులు చెల్లించవచ్చు. హోమ్​స్క్రీన్​పై కనిపించే ఎలక్ట్రిసిటీ బిల్​పేమెంట్​పై క్లిక్​చేయండి. ఆ తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ను ఎంచుకోవాలి. తర్వాత కన్స్యూమర్​ నెంబర్​ ఎంటర్​చేసి మీ యూపీఐ ఐడీ ఉపయోగించి బ్యాలెన్స్ అమౌంట్‌ను చెల్లించండి.

ఫోన్​పే:

ఇక ఫోన్​పేలో ‘రీఛార్జ్ అండ్​బిల్​పేమెంట్’ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. దానిలో ఎలక్ట్రిసిటీ బిల్​ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ బిల్లర్ పేరును టాప్ సెర్చ్ బార్‌లో ఎంటర్​ చేయండి. మీ కన్స్యూమర్ ఐడీని టైప్ చేసి, కన్ఫర్మ్ నొక్కండి. మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్​మొత్తం చూపిస్తుంది. ఇలా కూడా బిల్లు చెల్లించవచ్చు.

పేటీఎం:

పేటీఎం యాప్​ద్వారా కూడా సులభంగా మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. ముందుగా పేటీఎం యాప్‌ని ఓపెన్​చేసి యాప్ హోమ్‌పేజీలో రీఛార్జ్, బిల్ పేమెంట్​ విభాగంలోకి వెళ్లండి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అనే ఆప్షన్​పై క్లిక్​చేసి మీ రాష్ట్ర పరిధిలోని ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ యూజర్​ఐడీని ఎంటర్​చేసి కంటిన్యూపై నొక్కండి. ఈ విధానం ద్వారా బిల్లు చెల్లించవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Home Loan: మీరు హోమ్‌ లోన్‌ తీసుకున్నారా..? సరైన సమయానికి వాయిదాలు చెల్లించకపోతే ఏమవుతుంది..?

Bank Loan Offer: ఈ బ్యాంకులో రుణాలు పొందేవారికి అదిరిపోయే శుభవార్త.. రూ.లక్షకు 630 ఈఎంఐ సదుపాయం..!

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!