Bank Loan Offer: ఈ బ్యాంకులో రుణాలు పొందేవారికి అదిరిపోయే శుభవార్త.. రూ.లక్షకు 630 ఈఎంఐ సదుపాయం..!

Bank Loan Offer: పండగ సీజన్‌లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలు కూడా వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నాయి. వివిధ రకాల..

Bank Loan Offer: ఈ బ్యాంకులో రుణాలు పొందేవారికి అదిరిపోయే శుభవార్త.. రూ.లక్షకు 630 ఈఎంఐ సదుపాయం..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 18, 2021 | 6:18 PM

Bank Loan Offer: పండగ సీజన్‌లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలు కూడా వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నాయి. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజులలో రాయితీలు కల్పించాయి. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. హోమ్ లోన్స్, కార్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది.

హోమ్‌ లోన్స్‌పై..

బ్యాంకు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్లను తగ్గించేసింది. అలాగే వాహనాల రుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. రేట్ల కోత తగ్గింపు నేపథ్యంలో బ్యాంకు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. రూ.లక్షకు ఈఎంఐ రూ.632 నుంచి ఉంటుంది. అలాగే వాహనాల లోన్ష్‌పై వడ్డీ రేటు 6.85 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఇది వరకు బ్యాంకులో హోమ్ లోన్స్‌పై‌ వడ్డీ రేటు 6.85 శాతంగా ఉండేది. అలాగే వాహనాల లోన్‌పై వడ్డీ రేటు గతంలో 7.35 శాతంగా ఉండేది. అక్టోబర్ 18 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. డిసెంబర్ వరకు ఇదే రేట్లు కొనసాగుతాయి. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా లభిస్తోంది.

కాగా, ఇటీవల కాలం నుంచి బ్యాంకులు సులభమైన రుణాలను అందిస్తోంది. వివిధ రకాల స్కీమ్‌లలో చేరిన వారిని సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. రుణాలపై కూడా తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి. అంతేకాదు పండగ సీజన్‌లో వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి బ్యాంకులు. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఫీజులలో రాయితీ కల్పిస్తున్నాయి. గృహ రుణాలలో అయితే వడ్డీ రేట్లను తగ్గించాయి. వ్యక్తిగత రుణాలపై కూడా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Banks Loan: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా..? ఈ రెండు స్కీమ్‌లో చేరితే సులభంగా రుణాలు..!

Face Recognition: అక్కడ మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే డబ్బులతో పని లేదు.. ఫేస్‌ చూపిస్తే చాలు ప్రయాణించవచ్చు..!