Bank Loan: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా..? ఈ రెండు స్కీమ్‌లో చేరితే సులభంగా రుణాలు..!
Bank Loan: కరోనా మహమ్మారి సమయం నుంచి ఆర్థికంగా ఎంతో మంది నష్టపోయారు. దీంతో బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు..
Bank Loan: కరోనా మహమ్మారి సమయం నుంచి ఆర్థికంగా ఎంతో మంది నష్టపోయారు. దీంతో బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. రుణాలు అందించేందుకు ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి ఓ మంచి అవకాశం ఉంది. రెండు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరిన వారికి సులభంగా రుణాలు పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) వంటి పథకాల్లో చేరిన వారికి సులభంగానే రుణాలు లభిస్తాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వీరికి రుణాలు అందిస్తోంది.
ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరితే 6.9 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పది సంవత్సరాలు. ఈ కాలంలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ విషయానికి వస్తే.. ఈ స్కీమ్‌పై 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఈ స్కీమ్‌లో చేరిన వారికి వారి పెట్టిన పెట్టుబడి విలువలో 85 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తోంది. ఇతర బ్యాంకుల పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే.. వడ్డీ రేటు తక్కువనే చెప్పాలి.
కాగా, ఇటీవల కాలం నుంచి బ్యాంకులు సులభమైన రుణాలను అందిస్తోంది. వివిధ రకాల స్కీమ్‌లలో చేరిన వారిని సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. రుణాలపై కూడా తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి. అంతేకాదు పండగ సీజన్‌లో వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి బ్యాంకులు. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఫీజులలో రాయితీ కల్పిస్తున్నాయి. గృహ రుణాలలో అయితే వడ్డీ రేట్లను తగ్గించాయి. వ్యక్తిగత రుణాలపై కూడా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.