SBI: ఎస్‌బీఐ ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త.. ఇలా చేశారో ఇక మీ పని అంతే సంగతులు..
SBI: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాతో యూజర్లకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకొని సైబర్ దాడులకు దిగుతున్నారు. మోసపూరిత..
SBI: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాతో యూజర్లకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకొని సైబర్ దాడులకు దిగుతున్నారు. మోసపూరిత లింక్‌లను మొబైల్ ఫోన్లకు పంపిస్తూ యూజర్ల డేటాను తస్కరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఆఫర్ల పేరిట ఈ ఫేక్ లింక్‌లు ఎక్కువుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ యూజర్లను అలర్ట్ చేసింది.
బహుమతుల పేరిట వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘మీ ఇన్‌బాక్స్‌లో బహుమతుల పేరిట వస్తోన్న లింక్‌లను ఒకటి రెండు సార్లు స్పష్టంగా చూసుకోండి. ఒకవేళ తొందరపడి క్లిక్ చేశారో మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, కీలక వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. జాగ్రత్తగా ఉండండి.. లింక్‌లను క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి’ అంటూ పేర్కొన్నారు.
Are you receiving these links in your inbox? Steer Clear! Clicking on these phishing links could lead to loss of your personal and confidential information. Stay alert. Think before you click!#ThinkBeforeYouClick #StayAlert #StaySafe #CyberSafety pic.twitter.com/e9v3E31Nny
— State Bank of India (@TheOfficialSBI) October 17, 2021
ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయంటే..
* మీరు బహుమతి గెలుచుకున్నట్లు ముందుగా మీకు ఓ లింక్ వస్తుంది. గిఫ్ట్‌ను పొందాలంటే లింక్‌ను క్లిక్ చేయాలని సందేశంలో ఉంటుంది. * యూజర్ సదరు లింక్‌ను క్లిక్ చేయగానే వెంటనే ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. * సదరు వెబ్‌సైట్‌లో బహుమతి పొందాలంటే ఫామ్‌ను నింపాలని కోరుతుంది. అందులో మీ వ్యక్తగత వివరాలను అడుగుతారు. * లాగిన్, ప్రొఫైల్ ఐడీ, పిన్ వంటివి ఎంటర్ చేయగానే మీ సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఎలా బయటపడాలి..
హ్యాకర్ల దాడికి గురి కావద్దనుకుంటే అనుమానాదస్పదంగా ఉన్న ఎలాంటి లింక్‌ను క్లిక్ చేయకూడదు. అంతేకాకుండా పాప్ అప్ విండో ద్వారా వచ్చే ప్రకటనల్లోనూ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదు. పాస్‌వర్డ్, పిన్, సీసీవీని చివరికి బ్యాంకు ఉద్యోగులు కూడా నేరుగా వినియోగదారుడిని అడిగే హక్కు లేదని గుర్తుంచుకోవాలి. ఇలాంటి సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండొచ్చు.
Also Read: Midnight Horror: తల్లి నిద్రపోయిన కాసేపటికే.. కవలల దుర్మరణం.. అర్ధరాత్రి 25వ అంతస్థు పైనుంచి పడి..
AP Weather Report: ఏపీలో క్రమంగా తగ్గుతున్న నైరుతి ప్రభావం.. రాగల 3 రోజుల్లో మోస్తరు వర్షాలు
LPG Cylinder: గ్యాస్ సిలెండర్ లీక్ అవుతోందా? కంగారు వద్దు.. ఇలా చేయండి..