Face Recognition: అక్కడ మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే డబ్బులతో పని లేదు.. ఫేస్‌ చూపిస్తే చాలు ప్రయాణించవచ్చు..!

Face Recognition: ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజులు గడుస్తున్నకొద్ది మానవునికి..

Face Recognition: అక్కడ మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే డబ్బులతో పని లేదు.. ఫేస్‌ చూపిస్తే చాలు ప్రయాణించవచ్చు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 18, 2021 | 4:49 PM

Face Recognition: ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజులు గడుస్తున్నకొద్ది మానవునికి మెరుగైన టెక్నాలజీని అందించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని అందించేందుకు శ్రమిస్తున్నారు. ఈ టెక్నాలజీ కారణంగా మానవుని జీవన విధానం మరింత సులభగా మారుతోంది. ప్రస్తుతమున్న రోజుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాడు మానవుడు. తాజాగా తాజాగా ఓ దేశానికి చెందిన కేపిటల్‌ సిటీలోని మెట్రో అధికారులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని జోడించారు. అయితే మెట్రో ఎక్కాలంటే చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు.ఫేస్‌ చూపిస్తే చాలు మెట్రోలో ప్రయాణించే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంతో జనాలు తెగ సంబరపడిపోతున్నారు.

సాధారణంగా మన దేశంలో ఉన్న మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే డబ్బులు చెల్లించి టికెట్‌ తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. లేదంటే రిఛార్జ్‌ కార్డ్‌ తీసుకోవడమో, ఇతర వ్యాలెట్ల ద్వారా టికెట్‌ తీసుకుంటాము. కానీ రష్యా రాజధాని మాస్కోకు చెందిన మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్‌, రీఛార్జ్‌ కార్డ్‌లతో ఎలాంటి సంబంధం లేదు. ఫేస్‌ చూపిస్తే చాలు రైలులో ప్రయాణించవచ్చు. రాజధాని మాస్కో ప్రజల రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు మెట్రో అధికారులు మొదటిసారిగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. 240 స్టేషన్లలో ఫేషియల్ ఐడీతో డబ్బులు చెల్లించేందుకు వ్యవస్థని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఫేస్‌ చూపిస్తే రైళ్లల్లో ఎలా అనుమతిస్తారనే అనుమానం రావచ్చు. ఇందుకోసం మెట్రో ప్రయాణికులు వారి ఫోటోలను బ్యాంక్‌ అకౌంట్లలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాంకు అకౌంట్లను మాస్కో మెట్రో యాప్ ద్వారా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లో ఉన్న కెమెరాలకు ఫేస్‌ చూపించి మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. ఈ సందర్భంగా మాస్కో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మాట్లాడుతూ.. ఈ ఫేస్‌ పే వ్యవవస్థను చాలా అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువచ్చామని, క్యాప్చరైన ప్రయాణికుల ఫోటోలు ప్రభుత్వ ఐటీ శాఖ ఆధీనంలో ఉంటాయని అన్నారు.

ఫోటోలతో ఆందోళన వద్దు..

కాగా, ఈ ఫోటోలతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాస్కో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు దిగిన ఫోటోలు మాస్కో యూనిఫైడ్‌ డేటా స్టోరేజ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌లో భద్రంగా ఉంటాయన్నారు. ఈ టెక్నాలజీ భద్రత గురించి ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు.

ఇవీ కూడా చదవండి:

కాశ్మీర్ వలస కూలీలకు హెచ్చరిక.. పౌరులను హత్య చేసింది తామే.. ప్రకటించిన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్

China Hypersonic Missile: అణు సంబంధిత హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్షించిన చైనా!